YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణకు ఆంధ్రా మద్యం ఆదాయం

తెలంగాణకు ఆంధ్రా మద్యం ఆదాయం

హైద్రాబాద్, ఆగస్టు 8, 
తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్‌ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గత ఏడాది జులై కంటే ఈసారి రూ.600 కోట్లు అదనంగా ఖజనాకు చేరింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు జిల్లాల్లో మద్యానికి డిమాండ్‌ చాలా పెరిగింది. మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని మద్యం దుకాణాలకు అదనపు ఆదాయం వస్తోంది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వల్ల వ్యాపారాలన్నీ డల్ అయ్యాయి. వ్యాపార సంస్థలు రాబడులు లేక ఇబ్బంది పడుతున్నాయి. దీంతో ప్రజల వద్ద కొనుగోలు శక్తి తగ్గిందన్న భావన నెలకొంది. అయితే తెలంగాణలో మద్యం ప్రియులు తాగుడుకు భారీగా ఖర్చు చేశారు. ఒక్క జులైలోనే ఏకంగా రూ.2,507 కోట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఇదే నెలలో మద్యం అమ్మకాలతో పోలిస్తే రూ.600 కోట్ల విలువైన అమ్మకాలు అదనంగా జరిగాయి.ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు భారీగా పెరగ్గా ఆ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. ఏపీలో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడుల్లో చిక్కుతున్నా మద్యం అక్రమ రవాణా ఆగట్లేదు. మొత్తాన్ని ఆంధ్రా ప్రజలు మద్యం రూపంలో తెలంగాణ సర్కార్ ఖజానా నింపుతున్నారని భావించవచ్చు. ఏపీ సరిహద్దు జిల్లాల్లో మద్యం విక్రయాలు పెరగడం ఇందుకు బలం చేకూరుస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈ జూన్‌లో రూ.190 కోట్లు, జులైలో రూ.203 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఖమ్మంలో జూన్‌లో రూ.198 కోట్లు, జులైలో రూ.210 కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి. నల్లగొండ జిల్లాలో జూన్‌లో రూ.274 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, జులైలో రూ.295 కోట్లు విలువైన మద్యం అమ్ముడైంది. ఏపీ సరిహద్దు జిల్లాల్లో రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు మద్యం విక్రయాలు అదనంగా జరిగాయని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేధం దిశగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రంలో మద్యం ధరలను భారీగా పెంచేసింది. బెల్టు షాపులను కూడా పూర్తిగా రద్దు చేసింది. అలాగే లిక్కర్ షాపుల టైమింగ్స్‌ను కూడా కుదించింది. దీంతో మందుబాబులు మద్యం కోసం తెలంగాణ సరిహద్దుల్లోని మద్యం దుకాణాలకు పోటెత్తుతున్నట్లు తెలుస్తోంది.

Related Posts