YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాష్ట్ర రాజకీయాలకు రేణుకా గుడ్ బైయేనా

రాష్ట్ర రాజకీయాలకు రేణుకా గుడ్ బైయేనా

ఖమ్మం, ఆగస్టు 8, 
తెలంగాణ రాజ‌కీయాల్లోనే కాకుండా.. దేశంలో కాంగ్రెస్ రాజ‌కీయాల్లోనూ త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న కీల‌క నాయ‌కురాలు.. మాజీ ఎంపీ రేణుకా చౌద‌రి. గ‌త ఏడాది ఎన్నిక‌ల త‌ర్వాత ఇప్పటి వ‌ర‌కు ఎక్కడా క‌నిపించ‌లేదు. కాంగ్రెస్ పార్టీలో నిన్న మొన్నటి వరకూ చ‌క్రం తిప్పిన రేణుక‌ తెలంగాణ‌లో బ్రాండ్ సృష్టించారు. నాటి ఉమ్మడి రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆమె ఓ ఫైర్‌బ్రాండ్ పొలిటిక‌ల్ లేడీ అన్న ముద్ర వేయించుకున్నారు. సోనియాతో పాటు కాంగ్రెస్ జాతీయ నాయ‌కుల‌తో ఉన్న ప‌రిచ‌యాల నేప‌థ్యంలో ఆమె ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా సాగేది. టీడీపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ రాజ‌కీయాల్లో రేణుక పైచేయి సాధించారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ రాజ‌కీయాల్లోనూ దూకుడుగా వ్యవ‌హ‌రించారు.కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ద‌గ్గర మంచి ప‌లుకుబ‌డి ఉన్న నాయ‌కురాలిగా ఎదిగారు. 1999, 2004లో ఖ‌మ్మం నుంచి వ‌రుస‌గా లోక్‌స‌భ‌కు ఎంపికైన ఆమె 2009 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఆ త‌ర్వాత సోనియాను మ‌చ్చిక చేసుకుని రాజ్యస‌భ‌కు కూడా ఎంపిక‌య్యారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. కాంగ్రెస్ పుంజుకుంటుంద‌ని భావించినా.. టీడీపీతో చేతులు క‌ల‌పడంతో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. వాస్తవంగా 2018 తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పోయిపోయి.. టీడీపీతో చేతులు క‌ల‌ప‌డాన్ని రేణుకా చౌద‌రికూడా వ్యతిరేకించారు. అయితే, రాహుల్ నిర్ణయానికి క‌ట్టుబ‌డ‌డం త‌ప్ప త‌న‌ముందు గ‌త్యంత‌రం లేద‌ని వెల్లడించిన ఆమె ఆ మేర‌కు అయిష్టంగానే ప్రచారం చేశారుఅయితే 2018లో జ‌రిగిన ముంద‌స్తు సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్ కూట‌మి చిత్తుగా ఓడిపోయినా ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో మాత్రం టీఆర్ఎస్‌ను కట్టడి చేయగలిగింది. అయితే జిల్లాలో ఈ జోరును కంటిన్యూ చేయించ‌డంలో రేణుకా చౌద‌రి విఫ‌ల‌మ‌య్యారు. గ‌త ఏడాది జ‌రిగిన లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున ఖ‌మ్మం ఎంపీ స్థానం నుంచి చివ‌ర్లో బ‌రిలోకి దిగిన రేణుక‌.. అప్పటిక‌ప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థిగా అవ‌త‌రించిన టీడీపీ నాయ‌కుడు నామా నాగేశ్వర‌రావుపై ఓడిపోయారు. ఐదు నెల‌ల క్రితం జిల్లాలో టీఆర్ఎస్‌కు ఒకే ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే వ‌చ్చింది.అయితే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మాత్రం కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రేణుకా చౌద‌రి ఏకంగా 1.65 ల‌క్షల ఓట్ల తేడాతో ఓట‌మిపాల‌య్యారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కూట‌మిని గెలిపించిన ప్రజ‌లు ఎంపీ ఎన్నిక‌ల్లో రేణుక‌ను చిత్తుగా ఓడించ‌డానికి ప్రధాన కార‌ణం ఆమెపై విశ్వాసం లేక‌పోవ‌డంతో పాటు ఆమెను గ‌తంలో వ‌రుస‌గా గెలిపించినా కూడా ఖ‌మ్మం ప్రజ‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే. పైగా జిల్లాలో రేణుక త‌న‌కంటూ ఓ వ‌ర్గాన్ని ప్రోత్సహిస్తూ వ‌స్తున్నారు. భ‌ట్టి విక్రమార్కతో పాటు మాజీ మంత్రి ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వర‌రావుతో పాటు జ‌లగం గ్రూపుతో ఆమెకు ఎప్పుడూ ప‌డేది కాదు.ఇక ఇప్పుడు వ‌న‌మా, జ‌ల‌గం టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు జిల్లా కాంగ్రెస్‌లో చెప్పుకునేందుకు క‌నీసం నియోజ‌క‌వ‌ర్గానికి ఒక నాయ‌కుడు కూడా లేని ప‌రిస్థితి. జ‌న‌ర‌ల్ సీట్లలో ఖ‌మ్మం, పాలేరులో పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. కొత్తగూడెంలో య‌డ‌వ‌ల్లి కృష్ణ పార్టీ పగ్గాలు చేపట్టినా ఆయ‌న స‌మ‌ర్థత‌పై ఆ పార్టీ నేత‌ల‌కే న‌మ్మకం లేదు. ఇక రేణుకా చౌద‌రిపై సొంత పార్టీ నేత‌లే అనేక ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇక ఎన్నికల్లో ఓడిన‌ప్పటి నుంచి రేణుక మౌనం వ్రతం చేప‌ట్టారు. ఎక్కడా రాజ‌కీయాల్లో క‌నిపించ‌డం లేదు. పైగా ఆమె రాజ్యస‌భ స‌భ్యత్వం కూడా గ‌డిచిపోయింది. పోనీ ఇంకోసారి రెన్యువ‌ల్ చేయించుకునేందుకు ఆశ ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ అధిష్టాన‌మే రాజ‌కీయంగా చిక్కుల్లో ఉంది. ఈ ప‌రిణామాల‌తో రేణుక కూడా సైలెంట్ అయ్యారు. మ‌రి ఆమె ప్రస్థానం ముగిసిన‌ట్టేనా? అనే చ‌ర్చ తెర‌మీదికి రావ‌డం గ‌మ‌నార్హం.

Related Posts