YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

హన్మకొండ ఆగష్టు 13 
హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధానకార్యదర్శి అలువాల కార్తీక్, జిల్లా ఉపాధ్యక్షులు పల్లకొండ సతీష్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పరీక్షల షెడ్యూల్ ను ఖండిస్తూ, విద్యార్థులను పరీక్షలు లేకుండా పై తరగతులకు  ప్రమోట్ చెయ్యాలని, ఎన్ఎస్ యూఐ తలపెట్టిన ప్రగతిభవన్ ముట్టడి సందర్బంగా అరెస్ట్ అయిన తెలంగాణ ఎన్ఎస్ యూఐ  రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులను అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ, అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యూఐ. జిల్లా నాయకులు ప్రేమ్ చంద్, నాగరాజు, అరుణ్, విక్రమ్, వెంకటేష్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
 

Related Posts