YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వేతనాల చెల్లింపు పట్ల సీఐటీయూ హర్షం

వేతనాల చెల్లింపు పట్ల సీఐటీయూ హర్షం

కడప ఆగస్టు 13 
 కడప జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న రెండవ ఏఎన్ఎంలకు బకాయిపడ్డ 2 నెలల వేతనాలు చెల్లించినందుకు సిఐటియు  జిల్లా కార్యదర్శి రామ్మోహన్, జిల్లా కమిటీ సభ్యులు చంద్రారెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖలో కీలకంగా బాధ్యతలు నిర్వహిస్తున్న రెండవ ఏఎన్ఎమ్ లకు,  ఇతర సిబ్బంది వేతనాలను క్రమం తప్పకుండా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో గత 13 సంవత్సరాలుగా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న రెండవ ఏఎన్ యం లు ఇతర సిబ్బందిని తక్షణమే రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు . ఎప్పటికైనా తమ ఉద్యోగాలు రెగ్యులర్ కాక పోతాయని ఆశతో ఎదురు చూస్తున్న వీరికి ఇప్పటివరకు నిరాశే మిగులుతోందన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే వైద్య ఆరోగ్య శాఖ లో ఉన్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ రెగులర్  చేసి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. బకాయిపడ్డ వేతనాలు చెల్లించాలని ఈనెల 17వ తేదీన సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన ఆందోళనను వేతనాలు చెల్లించిన కారణంగా రద్దు చేస్తున్నట్లు వారు తెలియజేశారు.

Related Posts