YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సోషల్ మీడియా పోస్టులపై సీపీ వార్నింగ్

సోషల్ మీడియా పోస్టులపై సీపీ వార్నింగ్

హైద్రాబాద్, ఆగస్టు 13 
బెంగళూరులో హింసాత్మకమైన అల్లర్లు చెలరేగిన వేళ తెలంగాణలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చేసిన పోస్టుల మూలంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు నిఘా పెంచారు. అన్ని జిల్లాల పోలీస్ యంత్రాంగాలను అలర్ట్ చేసి, శాంతి భద్రతలను దెబ్బతీసేలా పోస్టులు ఉంటే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో విద్వేషకర పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు నిరంతరం గమనిస్తుంటారని అన్నారు.దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని స్టేషన్లకూ, సీనియర్ అధికారులకూ ఆదేశాలు జారీచేసినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ వెల్లడించారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని అన్ని కమిషనరేట్లు, జిల్లా ఎస్పీలకు, స్టేషన్ ఆఫీసర్లలకు డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయని చెప్పారు. తెలంగాణ భద్రత, రక్షణ విషయంలో అత్యున్నత స్థాయి పాటించేలా పోలీసులకు సహకరించాలని ప్రజలకు సూచించారు.బెంగళూరులో కాంగ్రెస్‌కు చెందిన ఓ వ్యక్తి చేసిన పోస్ట్ ఈ కల్లోలానికి దారితీసింది. వేల సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే నివాసం, పోలీస్ స్టేషన్‌పైనా దాడికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాలను మోహరింపజేశారు.

Related Posts