YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బీహార్ లో ఆయారాం...గ‌యారాం...

బీహార్ లో ఆయారాం...గ‌యారాం...

బీహార్ లో ఆయారాం...గ‌యారాం...
పాట్నా, 
బీహార్ ఎన్నికల ప్రచారం హాట్ హాట్ గా జరుగుతున్నాయి. అలాగే వ్యూహ ప్రతివ్యూహాలు కూడా అలాగే ఉన్నాయి. రెండు కూటముల మధ్య నెలకొన్న పోటీ ఉత్కంఠను రేపుతుంది. బీజేపీ, జేడీయూ కలసి ఒక కూటమిగా ఏర్పడగా, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటములలో చిన్నా చితకా పార్టీలు కూడా చేరిపోతున్నాయి. ఎవరు ఎక్కువ సీట్లు కేటాయిస్తే వారివైపే చిన్న పార్టీలు మొగ్గు చూపుతుండటం విశేషం.బీహార్ లో ఇప్పటికే బీజీపీ, జేడీయూ కూటమిని వదలేసి లోక్ జనశక్తి పార్టీ వెళ్లిపోయింది. తాము విడిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. నితీష్ కుమార్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎన్డీఏను వదిలి వెళ్లిపోయింది. ఇక మహాకూటమి నుంచి మాంఝీ పార్టీ వైదొలిగింది. జేడీయూ వైపు చేరింది. ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ కూడా మహాకూటమి నుంచి వెళ్లిపోయింది. తేజస్వి యాదవ్ నాయకత్వాన్ని ఇష్టపడక ఆ పార్టీ వైదొలిగింది.ఇక బీహార్ లో ఎవరేమనుకున్నా జేడీయూ, ఆర్జేడీలే ప్రధాన పార్టీలని చెప్పక తప్పదు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు వీటికి జూనియర్ పార్ట్ నర్లగానే మిగిలిపోవాల్సి ఉంటుంది. సీట్ల పంపకాలు, నాయకత్వం ఇష్టంలేక అనేక పార్టీలు తమను వదలేసి వెళుతున్నా పెద్దగా ఆలోచన చేయడం లేదు. మరో పార్టీని చేరదీసేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. బీహార్ లో మొత్తం 243 స్థానాల్లో బీజేపీ 121, జేడీయూ 122 స్థానాలను పంచుకున్న సంగతి తెలిసిందే.బీహార్ లో బీజేపీ వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీని ఎన్డీఏలోకి చేర్చుకుంది. ముఖేష్ సహానీ నేతృత్వంలోని ఈ పార్టీ బీసీల్లో పట్టున్న పార్టీగా గుర్తింపు ఉంది. తనకు కేటాయించిన 121 సీట్లలో 11 స్థానాలను వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీకి కేటాయించింది. గతంలో ముఖేష్ సహానీ బీజేపీకి అనుకూలంగానే ఉండేవారు. కానీ తమ సామాజికవర్గాన్ని ఎస్సీల్లో కలపలేదని బయటకు వచ్చేశారు. తిరిగి ఆయన ఎన్డీఏ కూటమిలో చేరారు. మొత్తం మీద బీహార్ లో ఎన్నికలకు ముందు ఆయారం గయారాలు ఎక్కువయ్యారు. ఒక పార్టీ బయటకు వెళితే మరో పార్టీని చేర్చుకుని బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

Related Posts