YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మార్కెటింగ్ శాఖపై సీఎం సమీక్ష

మార్కెటింగ్ శాఖపై సీఎం సమీక్ష

అమరావతి అక్టోబర్, 28
అగ్రి ఇన్ఫ్రా ఫండ్ ప్రాజెక్ట్, ఇ- మార్కెటింగ్ ఫ్లాట్ ఫామ్స్ పై సీఎం  వైయస్.జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయనే కామెంట్లు రాకూడదని అన్నారు. కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధర ఉందని అలర్ట్ వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి. రైతులకు సరైన ధర వచ్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏయే పంటలకు ఎంఎస్పీ లభించడంలేదో సమాచారం యాప్ద్వారా వస్తోందని వెంటనే చర్యలు తీసుకుంటున్నామని  అధికారులు. ముఖ్యమంత్రికి వివరించారు. 10,641 ఆర్బీకేల ద్వారా పంటలకు కనీస ధరలు ఉన్నాయా? లేవా? అన్న సమాచారం ప్రతిరోజూ కచ్చితంగా రావాలన్న సీఎం,  కనీస ధర రావడంలేదో పరిశీలన చేసి, ఆమేరకు జిల్లాల్లో  ఉన్న జేసీలద్వారా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. సంబంధిత ఆర్బేకేల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా ఆ పంటలకు ఎందుకు ధరరావడంలేదో తెలుసుకుని, తగిన చర్యలు తీసుకోవాలి. సంబంధిత శాఖల ద్వారా రైతుల్ని ఆదుకునే చర్యలను చేపట్టాలి. రైతులనుంచి చేసిన కొనుగోళ్లకు 10 రోజుల్లోగా పేమెంట్ అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 5812 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.  పంటలకు కనీస మద్దతు ధరల రేట్లను ఆర్బీకేల్లో ప్రదర్శించాలని సీఎం ఆదేశించారు. రైతులకు అందరికీ తెలిసేలా పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టాలి. వర్షాలు కారణంగా దెబ్బతిన్న వరి, వేరుశెనగ, పత్తిలాంటి పంటలను కొనుగోలు చేయడంలో రైతులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. పత్తిరైతులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కాటన్కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులకు సీఎం ఆదేశించారు. పంటను అమ్ముకోవడానికి రైతు ఇబ్బంది పడకూడదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. ప్రత్యామ్నాయ మార్కెట్లు చూపాలి లేకపోతే వెంటనే ప్రభుత్వమే కొనుగోలు చేయాలనిసీఎం అన్నారు. 

Related Posts