YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఢిల్లీకి దూరంగా సోనియా

ఢిల్లీకి దూరంగా సోనియా

న్యూఢిల్లీ, నవంబర్ 20 
లంగ్స్ ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్న సోనియా గాంధీ ఆరోగ్యం ఢిల్లీ కాలుష్యంతో మరింత క్షీణిస్తోంది. వైద్యుల సూచన మేరకు ఆమె ఢిల్లీని వీడనున్నారు.కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఢిల్లీ కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్న సోనియా ఆరోగ్యం కాలుష్యంతో మరింత క్షీణిస్తోంది. కొంత కాలం పాటు రాజధాని నగరాన్ని వీడి ఎక్కడికైనా వెళ్లాలని ఆమెకు వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీని వీడటానికి సిద్ధమైనట్లు శుక్రవారం పార్టీ వర్గాలు వెల్లడించాయి.గోవా లేదా చెన్నైలో సోనియా గాంధీ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోనియా శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయల్దేరనున్నారని.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలో ఎవరో ఒకరు ఆమె వెంట ఉండనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ కారణంగా కొంతకాలంగా సోనియా గాంధీ పూర్తి స్థాయిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటున్నారు. కొంతకాలంగా మందులు వాడుతున్నారు. అయినప్పటికీ ఇన్ఫెక్షన్‌లో తగ్గుదల కనిపించలేదని వైద్యులు తెలిపారు. దీంతో సోనియా అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఢిల్లీలో కాలుష్యం ప్రభావం ఎక్కువైంది. ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఉంది. ఇది ఆమె అనారోగ్యాన్ని మరింత ప్రభావితం చేసింది.ఈ ఏడాది జులైలో ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్‌లో సోనియా గాంధీ కొంతకాలం చికిత్స పొందారు. అనంతరం సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సెప్టెంబర్‌ 12న అమెరికా వెళ్లారు. అప్పుడు ఆమె వెంట రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఆ సమయంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితుల మధ్య నిర్వహించిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వీరిద్దరూ హాజరు కాలేకపోయారు.

Related Posts