YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కాంగ్రెస్ కు 20 సీట్లే....

కాంగ్రెస్ కు 20 సీట్లే....

చెన్నై, నవంబర్ 21, గ్రెస్ కు కష్టాలు కొనసాగేటట్లే ఉన్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ఎఫెక్ట్ ఇతర రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ కూటమిలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది. 70 స్థానాల్లో పోటీ చేసి 19 చోట్ల మాత్రమే కాంగ్రెెస్ అభ్యర్థులు విజయం సాధించారు. హస్తం గుర్తు అస్తవ్యస్తంగా మారిపోయినట్లే కనపడుతుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే తమిళనాడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పట్ల డీఎంకే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ డీఎంకే కూటమిలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది. 2015 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి డీఎంకే నలభై స్థానాలు కేటాయిస్తే అందులో ఎనిమిది చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఎక్కువ స్థానాలను కోరుతున్నారు. తమకు బలం ఉందని, లేకుంటే కూటమి నుంచి తప్పు కుంటామని కూడా ఒక దశలో కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.అయితే బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ కు వీలయినన్ని తక్కువ స్థానాలను కేటాయించాలని డీఎంకే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు ఇచ్చినా అది వృధాయేనని డీఎంకే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో కాంగ్రెస్ కు తమిళనాడులో 20 సీట్లకు మించి ఇవ్వరాదని డీఎంకే నేతలు ఇప్పటికే సంకేతాలు పంపారని చెబుతున్నారు. ఇరవై స్థానాలు కూడా తాము చెప్పిన స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని షరతు కూడా పెట్టే అవకాశముంది.కాంగ్రెస్ గుర్తుకు విలువ లేకుండా పోయిందన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో విన్పిస్తుంది. ఒకప్పుడు హస్తం గుర్తు కూటమిలోని ఇతర పార్టీలకు ఆసరాగా ఉండేది. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. కాంగ్రెస్ ఇతర పార్టీలకు భారంగా మారింది. బీహార్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీకి అన్ని రాష్ట్రాల్లో కూటమి పార్టీల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధానంగా తమిళనాడులో డీఎంకే ఇచ్చిన సీట్లను సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Related Posts