YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రమేష్...రాజీనామా ఆమోదం

రమేష్...రాజీనామా ఆమోదం

హైదరాబాద్, నవంబర్ 21
ఏపీ సీఎం జగన్ అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ రాజీనామాకు ఆమోదం తెలిపారు. రాజీనామా ఆమోదిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్న పీవీ రమేష్ సీఎంవో నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నవంబర్ 1న బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ట్వీట్ చేశారు.. సీఎంవో నుంచి వైదొలిగినట్లు చెప్పారు.35 ఏళ్ల నుంచి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ప్రజాసేవ చేస్తున్నాను అన్నారు. తన కెరీర్‌లో ప్రజలకు మెరుగైన సుపరిపాలన, చిత్తశుద్ధితో, పోటీతత్వంతో కూడిన సేవలు అందించేందుకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకు సీఎం అదనపు ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.నాలుగు నెలల క్రితం ఏపీ సీఎంవోలో కీలక మార్పులు జరిగాయి. సీఎం కార్యాలయంలోని అధికారులకు శాఖల్లో మార్పులు జరిగాయి. సీఎం కార్యాలయం బాధ్యతలు నుంచి అజేయ్ కల్లాం, పీవీ రమేష్, జే. మురళిని తప్పించారు. ఆ ముగ్గురి బాధ్యతల్ని ప్రవీణ్ ప్రకాష్, సాల్మాన్ ఆరోఖ్య రాజ్, ధనుంజయ్ రెడ్డిలకు బదలాయించారు. సీఎంవోలో కీలకంగా ఉన్న అజేయ్ కల్లాం, పీవీ రమేష్‌లను తప్పించడం అప్పుడే ఆసక్తికరంగా మారింది. పీవీ రమేష్‌కు తొలుత కీలక శాఖలు అప్పగించినా మధ్యలో కోత వేసి వైద్యం, విద్య వంటి శాఖలకు పరిమితం చేశారు. అప్పుడే రమేష్ తప్పుకుంటారని ప్రచారం జరిగింది.

Related Posts