YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణలో చేతులు ఎత్తేసేరా...

తెలంగాణలో చేతులు ఎత్తేసేరా...

హైదరాబాద్, నవంబర్ 23, 
ఎలాంటి చంద్రబాబు ఎలా అయ్యారు. ఆయన వర్తమాన రాజకియ స్థితిని చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తోంది. ఉమ్మడి ఏపీలోని 23 జిల్లాలను కలుపుకుని దాదాపు తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పాలించిన ఘనత చంద్రబాబుదే. ఆ రికార్డు ఆయన పేరు మీదనే ఉంది. అటువంటి చంద్రబాబు రాష్ట్రం విడిపోయాక జాతీయ అధ్యక్షుడిని అని చెప్పుకున్నారు. అక్కడా ఇక్కడా కూడా తెలుగుదేశం జెండా ఎగురుతుందని కూడా గట్టిగానే చెప్పారు. మరి 2014 తరువాత ఆయన పూర్తిగా ఏపీకే పరిమితం అయిపోయారు. ఇక ఆయన తెలంగాణా మీద కొద్దిగా ఆశలు పెంచుకుని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని మరీ 2018 ఎన్నికలకు వెళ్ళారు. కానీ అక్కడ బెడిసికొట్టడంతో ఆయన రెండేళ్ళుగా తానున్న గడ్డ మీద పోటీ అంటేనే భయపడుతున్నారు.బీజేపీకి జై కొట్టడానికి చంద్రబాబు ఏ అవకాశాన్ని అసలు వదులుకోరు. ఆయన పూర్తిగా వన్ సైడ్ లవ్ ట్రాక్ పట్టేసారు విసిగి వేసారి ఏదో నాడు కమలం తన చెంతకు చేరకపోతుందా అన్నది చంద్రబాబు ప్లాన్. అందుకే దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిన వెంటనే జై కాషాయం అనేశారు. తన విజయంగా భావించి సంబరాలే చేసుకున్నారు. నిజానికి అక్కడ బీజేపీ గెలిస్తే చంద్రబాబు అంతలా మురిసిపోవడం అంటే వ్యూహాల పరంగా కరెక్ట్ అయినా బాబు పొలిటికల్ ఇమేజ్ పరంగా అసలు కాదని అంటున్నారు. పోటీ చేయాల్సిన చోట చేతులెత్తేసిన చంద్రబాబు బీజేపీ గెలుపునకు చప్పట్లు కొట్టడం అంటే తాను ఏమీ కానని చెప్పుకోవడమేనా అన్న మాట కూడా వస్తోంది.చెప్పాలంటే తెలంగాణాలో టీడీపీ ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉంది. ఆ పార్టీకి ఒక సారధిని చూపించి చంద్రబాబు తగిన బాధ్యత తీసుకుంటే బీజేపీ కంటే మెరుగైన ఫలితాలనే తెలంగాణాలో చాలా చోట్ల టీడీపీ సాధిస్తుంది అని తమ్ముళ్లు అంటున్నారు. మరి జాతీయ పార్టీగా చెప్పుకుని దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేయకుండా చంద్రబాబు ఏం సందేశం తమ్ముళ్లకు పంపారని కూడా అంటున్నారు. అదే సమయంలో బీజేపీని పొగడడం ద్వారా తెలంగాణాలో తమ పాత్ర ఏదీ లేదని క్లారిటీ ఇచ్చేశారా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది.అన్న ఎన్టీఆర్ గర్జించిన పార్టీ టీడీపీ, హైదరాబాద్ లో పుట్టిన పార్టీ కూడా టీడీపీ, ఎన్టీయార్ జమానాలో టీడీపీలో బేలతనం లేదు, ఎక్కడికైనా దూసుకుపోవడమే. ఎన్నికలు అంటే ఉత్సాహంగా పాలుపంచుకోవడమే, విజయమో వీర స్వర్గమో అంటూ నినదించిన అధినేత ఎన్టీయార్, మరి ఆయన వారసుడిగా చంద్రబాబు ఆ గర్వాన్ని తమ్ముళ్లకు లేకుండా చేశారని అంటున్నారు. రేపటి రోజున ఏపీలో కూడా బీజేపీ పుంజుకుంటే చప్పట్లు కొట్టి పక్కకు పొలిటికల్ గా త‌ప్పుకోవడానికి చంద్రబాబు సిధ్ధంగా ఉన్నారా అన్న మాట కూడా ఇపుడు వినిపిస్తోంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు ది చప్పట్లు కొట్టి సంబర పడే పాత్రగా మారిపోవడం రాజకీయ విషాదమే అంటున్నారు.

Related Posts