YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అళగిరి ఎఫెక్ట్ గట్టిగానే ఉండబోతోందా

అళగిరి ఎఫెక్ట్ గట్టిగానే ఉండబోతోందా

చెన్నై, నవంబర్ 24, 
తమిళనాడు ఎన్నికల వేళ కరుణానిధి కుటుంబంలో మరోసారి రచ్చ జరిగే అవకాశముంది. కరుణానిధి పెద్ద కుమారుడు ఆళగిరి సొంత పార్టీ పెట్టేందుకు సమాయత్తమయ్యారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగుతుండగా ఆళగిరి కొత్త పార్టీ డీఎంకేలో చర్చనీయాంశంగా మారింది. నిజానికి డీఎంకేకు ప్రస్తుతం మంచి వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆళగిరి సొంత పార్టీ ఇబ్బందులు తెచ్చిపెడుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.కరుణానిధి మరణం తర్వాత ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తతాయి. డీఎంకేలో పట్టుకోసం స్టాలిన్, ఆళగిరి ప్రయత్నించినా, ఎక్కువ మంది స్టాలిన్ కే మద్దతుగా నిలవడంతో ఆయన చేతికే పార్టీ పగ్గాలు దక్కాయి. అయితే ఆళగిరి తాను డీఎంకేలో ఉండేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. తనకు పార్టీలో కీలక పదవి ఇవ్వాలని కుటుంబ సభ్యుల ద్వారా స్టాలిన్ కు రాయబారం పంపారు. కానీ రాజకీయంగా భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన స్టాలిన్ ఆళగిరిని దూరం పెట్టారు.ఆళగిరిని పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తి లేదని, తండ్రి కరుణానిధి కూడా ఆళగిరిని పార్టీకి దూరం పెట్టిన విషయాన్ని స్టాలిన్ పదే పదే గుర్తు చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆళగిరి మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవడానికి సిద్దమయ్యారు. సొంత పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతోంది. కలైంజర్ డీఎంకేతో ఆళగిరి పార్టీ ఉంటుందని ఆయన మద్దతుదారులు పెద్దయెత్తున తమిళనాడులో ప్రచారం చేస్తున్నారు.కానీ ఆళగిరి సొంత పార్టీ పెట్టి బరిలోకి అభ్యర్థులను దింపితే అది డీఎంకేనే నష్టపరుస్తుం దంటున్నారు. డీఎంకేలో ఇప్పటికీ ఆళగిరిని అభిమానించే వారున్నారు. ఆయనకు మధురైలో మంచి పట్టు ఉండటంతో అక్కడ డీఎంకే కు దెబ్బపడే అవకాశముంది. అయితే ఆళగిరి సొంత పార్టీ పెట్టినా ఇప్పటికిప్పుడు స్టాలిన్ ఆయనతో రాజీపడే అవకాశం అయితే లేదు. అయితే ఆళగిరి మద్దతు కోసం ఇతరపార్టీలు ప్రయత్నించే అవకాశం మాత్రం ఉంది. మొత్తం మీద డీఎంకేలో ఆళగిరి మరోసారి అలజడి రేపారు. కానీ సోదరుడి దెబ్బ నుంచి డీఎంకే ఎలా బయటపడతారన్నది చూడాలి.

Related Posts