YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కమలం చేతిలో బందీగా నితీష్

కమలం చేతిలో బందీగా నితీష్

పాట్నా, నవంబర్ 24, 
బీహార్ ఎన్నికలు ముగిశాయి. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం కూడా పూర్తయింది. ఇక ఎంతకాలం నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారన్నదే ప్రశ్న. ఇప్పటికే నితీష్ కుమార్ ను బీజేపీ గుప్పిట్లో బంధించిది. మంత్రివర్గంలోనూ ఎర్కువ స్థానాలను బీజేపీయే దక్కించుకుంది. స్పీకర్ కూడా బీజేపీకి చెందిన వారే ఎంపిక అవుతారు. దీంతో నితీష్ కుమార్ ఇక నామినేటెడ్ ముఖ్యమంత్రిగానే మిగిలిపోవాల్సి ఉంటుందంటున్నారు.నితీష్ కుమార్ ఏడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈసారి ఆయన చాలా ఒడిదుడుకుల మధ్య సీఎం బాధ్యతలను చేపట్టినట్లే అనుకోవాల్సి ఉంటుంది. తొలి మంత్రివర్గంలో బీజేపీకి చెందిన ఏడుగురు, జేడీయూకు చెందిన ఐదుగురు, హెచ్ఐఎం, వీఐపీ పార్టీల నుంచి ఒక్కరు చొప్పున మంత్రులుగా ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రులు కూడా బీజీపీకి చెందిన వారే. వారు కరడుగట్టిన సంఘ్ నేతలు కావడంతో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం ఉండలేరంటున్నారు. నిజానికి ఈ ఎన్నికల ప్రచారంలోనే నితీష్ కుమార్ బ్లండర్ మిస్టేక్ చేశారు. తనకు ఇవే చివరి ఎన్నికలని ఆయన ప్రచారంలో చెప్పారు. అయినా ప్రజలు మాత్రం నితీష్ కుమార్ వైపు మొగ్గు చూపలేదు. ఎక్కువ శాతం బీజేపీ, ఆర్జేడీ వైపు మరలారు. దీంతో నితీష్ కుమార్ పట్ల బీహారీలు పెద్దగా ఆసక్తిగా లేరన్న విషయం అర్థమవుతుంది. మరోవైపు ఎన్నికలు పూర్తఅయి అధికారంలోకి వచ్చిన వెంటనే తాను చివరి ఎన్నికలు అనలేదని నితీష్ కుమార్ మాటమార్చడం కూడా ఆయన క్రెడిబులిటీని దెబ్బతీసింది.అయితే నితీష్ కుమార్ ఎక్కువ కాలం ఆ పదవిలో ఉండలేరని అంటున్నారు. ఆయనంతట ఆయనే పదవి నుంచి వైదొలిగేలా బీజేపీ ప్లాన్ చేస్తుందంటున్నారు. నితీష్ ను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకుండా చేసి, ఆయనను ఫ‌్రస్టేషన్ కు గురిచేస్తుందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. పేరుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అయినా పెత్తనం అంతా బీజేపీదే కావడంతో ఆయనకు ముఖ్యమంత్రి పదవి దినదినగండమేనని చెప్పక తప్పదు.

Related Posts