YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మజ్లీస్, టీడీపీ దోస్తి

మజ్లీస్, టీడీపీ దోస్తి

హైదరాబాద్, నవంబర్ 24, 
కాగల కార్యం గంధర్వులు నెరవేర్చాలని అంటారు. రాజకీయాల్లో కూడా అలాంటి గంధర్వులు చాలామందే ఉంటారు. వారు సందట్లో సడేమియాగా సందడి చేస్తూంటే ఫలాలు, ఫలితాలు వేరొకరు పొందుతూంటారు. బీహార్ లో జరిగింది ఇదే. రేపూ ఇదే సీన్ ఏపీలో రిపీట్ కావాలని చంద్రబాబు లాంటి వారు చాలా బలంగా కోరుకుంటారు. వీలైతే కోటి దేవుళ్లకు మొక్కుకుంటారు కూడా. ఏపీలో జగన్ బలాన్ని, బలగాన్ని తగ్గించే ఏ ఒక్క అవకాశమైనా చంద్రబాబు తప్పకుండా వాడేసుకుంటారు.మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన తండ్రి సలావుద్దీన్ ఒవైసీ నుంచి రాజకీయ వారసత్వాన్ని స్వీకరించారు. నాడు కేవలం హైదరాబాద్ ఎంపీగా మాత్రమే సలావుద్దీన్ పరిమితం. కొడుకు జమానాలో అయితే జాతీయ పార్టీగా రూపుదిద్దుకుంటోంది. ఎక్కడ బీహార్, మరెక్కడ భాగ్యనగరం, కానీ అసదుద్దీన్ వాటిని కలిపేశారు. తాజా ఎన్నికల్లో అయిదు సీట్లు కొట్టేశారు.బీజేపీకి మేలు జరిగింది. ఆర్జేడీ కూటమి ఓడింది అంతకు ముందు మహారాష్ట్రలో ఇలాగే మ్యాజిక్ చేసి ప్రధాన పార్టీల జాతకాలు మార్చేశారు. ఇపుడు పశ్చిమ బెంగాల్ అంటున్నారు. అలాగే 2024లో ఏపీలోనూ పోటీకి దిగుతారు అని అంటున్నారు.ఏపీలో చూసుకుంటే మొత్తం 175 సీట్లు ఉన్నాయి. ఇందులో ముస్లిం మైనారిటీ సీట్లు దాదాపు ఇరవై దాకా ఉంటాయని ఒక అంచనా. గుంటూరు, విశాఖ, కర్నూలు , చిత్తూరు కడప వంటి చోట్ల మైనారిటీలకు బాగానే బలం ఉంది. దాంతో ఈ సీట్లపైన ఇప్పటి నుంచే అసదుద్దీన్ ఒవైసీ కన్ను వేశారు అంటున్నారు. జగన్ ఆయనకు నిన్నటిదాకా మిత్రుడే. కానీ కేసీయార్ జగన్ ల మధ్య విభేదాలు వచ్చాయి కాబట్టి తనకు శత్రువు గానే చూస్తున్నారుట. దాంతో ఏపీలో ఎవరు ఏమైనా సరే తమ పార్టీ ఇరవై నుంచి పాతిక సీట్ల దాకా పోటీ చేస్తుంది అన్ని గట్టిగానే చెబుతున్నారని టాక్. అదే కనుక జరిగితే జగన్ పార్టీకి పెద్ద దెబ్బ అంటున్నారు. ఏపీలో అధికారం అందుకోవడానికి మ్యాజిక్ ఫిగ‌ర్ 88. వచ్చే ఎన్నికల్లో జగన్ కి ఎంత వ్యతిరేకత ఉన్నా వంద సీట్లు వస్తాయనుకుంటే మైనారిటీ ఓట్లు భారీ ఎత్తున చీలితే 2014 నాటి ఫలితాలే వైసీపీకి వస్తాయా అన్న మాట కూడా ఉంది.ఈ ఓట్ల చీలిక వల్ల అచ్చంగా లాభపడేది చంద్రబాబు నాయుడే అని అంటున్నారు. మజ్లీస్ పోటీ చేసినా గెలిచేది ఒకటో రెండో ఉంటే గొప్పే. కానీ మైనారిటీ ఓట్లలో చీలిక తెస్తే మాత్రం టీడీపీకి, చంద్రబాబుకు అది అతి పెద్ద లాభం అవుతుంది. అంటే ఒవైసీ ఏపీలో పోటీ అంటే చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్లేనని అంటున్నారు. మైనారిటీల ఓట్లు పెద్దగా టీడీపీకి ఎటూ పడవు, దాంతో జగన్ బలం అలా సగానికి సగం తగ్గితే టీడీపీకి విన్నింగ్ చాన్సెస్ పెరిగి అధికార పీఠం అందుకున్నా అందుకోవచ్చు అన్న విశ్లేషణ అయితే ఉంది. మరి జగన్ ఒవైసీతో గ్యాప్ లేకుండా చూసుకుంటారా. ఒవైసీ జగన్ మాట వింటారా. లేక ఇద్దరి మధ్యన పొత్తు కుదురుతుందా అన్నది చూడాలి. ఇవేమీ జరగకపోతే మాత్రం ఒవైసీ చంద్రబాబుకే అచ్చమైన దోస్త్ అవుతారు అనడంలో డౌటే లేదు.

Related Posts