YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టీచర్లకు నో డ్యూటీస్

టీచర్లకు నో డ్యూటీస్

హైదరాబాద్, నవంబర్ 24, 
అంతా రివ‌ర్స్ అయింది. టీచ‌ర్లు రివ‌ర్స్ గేర్ వేశారు. ప్ర‌భుత్వాన్ని కంప్లీట్ గా అపొజిట్ గా ఉండి డిమాండ్ చేస్తున్నారు. మ‌మ్మ‌ల్ని ఎన్నిక‌ల డ్యూటీకి ఎందుకు వేయ‌లేదో.. తేల్చి చెప్పండి. చెప్పి తీరాల్సిందే. లేదంటే ఊరుకునేదే లేదు హా.. అంటూ కాస్త ఆవేశంగానే ఉన్నారు. ఇంత‌కు ముందేమో.. మేం టీచ‌ర్లం క‌దా.. మమ్మ‌ల్ని ఎన్నిక‌ల డ్యూటీకి ఎందుకు వేస్తున్నారు.. మీకు వేరే ఎంప్లాయిస్ దొర‌క‌లేదా. టీచ‌ర్ల‌ని ఎవ‌రైనా ఇలాంటి ప‌నులు చేపిస్తారా. గురువుల్ని ట్రీట్ చేసే విధానం ఇదేనా. అస‌లు ప్ర‌భుత్వానికి శ‌రం లేదా అంటూ.. అబ్బో ఎన్నో మాట‌లు. ఇప్పుడేమో.. మ‌మ్మ‌ల్ని ఎన్నిక‌ల డ్యూటీకి ఎందుకు వేయ‌లేదు అంటున్నారు.ప్ర‌భుత్వం ఏమో.. ఎప్పుడూ టీచ‌ర్ల‌ని ముందు వ‌ర‌స‌లో నుంచో బెడుతుంది. పాఠాల కంటే పాలించే లీడ‌ర్లే ఇంపార్టెంట్. వాళ్ల‌ని ఎన్నుకోవ‌డ‌మే ఇంకా ఇంపార్టెంట్. స‌మాజానికి మంచి చెడు చెప్పే టీచ‌ర్లే.. స‌మాజానికి ప‌నికొచ్చే లీడ‌ర్ల ఎంపిక‌లో కూడా ముందుండాలి అంటూ ఎల‌క్ష‌న్ డ్యూటీ వేసేవారు. ఇప్పుడేమో వ‌ద్దు అన్నారు. పైగా టీచ‌ర్లంతా ఖాళీ ఖాళీగా ఉన్నారు. అయినా స‌రే.. గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కి వాళ్ల‌కి డ్యూటీ వేయ‌లేదు. ఎందుక‌య్యా అంటే మాత్రం.. టీచ‌ర్లు గ‌వ‌ర్న‌మెంట్ పై కోపంగా ఉన్నారు క‌దా. క‌రోనా టైంలో వాళ్ల‌ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని సీరియ‌స్ గా ఉన్నారు క‌దా. ఆ ఎఫెక్ట్ ఎన్నిక‌లపై ప‌డుతుంద‌నే భ‌యంతోనే డ్యూటీలు వేయ‌లేదు అనే టాక్ బ‌య‌టికి వ‌చ్చింది. వాళ్లేమో.. ఏ ప‌నీ లేకుండా ఉన్నాం.. క‌నీసం ఈ ప‌నైనా ఉండుంటే బావుండేది. వ‌ద్ద‌న్న‌ప్పుడేమో బ‌ల‌వంతంగా పంపించారు. ఇప్పుడేమో.. వెళ్ల‌డానికి రెడీగా ఉన్నా.. వ‌ద్దంటున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. పైగా ఎల‌క్ష‌న్ జ‌రిగేది బ్యాలెట్ ప‌ద్ద‌తిలో.. ఈ టైంలో టీచ‌ర్లే ఎక్కువ ఉండాలి. వారికే ఎల‌క్ష‌న్ గురించి ఎక్కువ తెలుసు అంటున్నారు. స‌ర్కారేమో.. అలాంటి నిర్ణ‌యం తీసుకుంది.

Related Posts