YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వరద సహాయం యాభై వేలు కాంగ్రెస్ ఎన్నికల హామి

వరద సహాయం యాభై వేలు కాంగ్రెస్ ఎన్నికల హామి

హైదరాబాద్ నవంబర్ 24 
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్  పార్టీ ప్రణాళిక హామీలు విడుదల చేసింది. వరద సహాయం బాధిత కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ. 50,000. పూర్తిగా దెబ్బతిన్న గృహాలకు రూ. 5 లక్షల చొప్పున మరియు పాక్షికంగా దెబ్బతిన్న వాటికి రూ. 2.5 లక్షల చొప్పున సహాయం,  భారీ వర్షాలు, వరదలలో చనిపోయిన ప్రతివ్యక్తి కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం, వరదలు, విపత్తు నిర్వహణ ఎన్డిఎంఎ మార్గదర్శకాలను అమలు చేస్తాం. హైదరాబాద్ కు విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించి క్రమం తప్పకుండా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తాం. డాప్లర్ వెదర్ రాడార్ చిత్రాల సహాయంతో వర్షాన్ని, అదేవిధంగా వర్షపాతాన్ని 3-6 గంటల ముందే ఎంత పడుతుందో అంచనావేసి అందుకు అనుగుణంగా సమాచార వ్యవస్థలను శక్తివంతంగా ఉపయోగించుకొని ప్రజలందరికీ సమాచారం అందించడం, ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని వనరులను సమకూర్చుకొని సంసిద్ధం కావడం జరుగుతుంది ఆర్ డబ్ల్యూ ఏలతోపాటు చెరువుల సంరక్షణ అథారిటీని ఏర్పాటు చేసి అవి కబ్జాలకు గురికాకుండా, అన్యాకాంత్రం కాకుండా చేయడం జరిగింది నాలాల పూడిక పనుల్ని ఎప్పటికప్పుడు చేపట్టడం, రిటైనింగ్ వాల్స్ .(అడ్డుగోడలు), ఫెన్సింగ్ నిర్మాణాలు చేపడతాం. జపాన్, హాంకాంగ్, స్పెయిన్ వంటి దేశాలలో ఏవిధంగానైతే విజయవంతంగా వరద నీటిని నిలువ చేసేందుకు, క్రమబద్దీకరించేందుకు అతిపెద్ద అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ సదుపాయాలను ఏర్పరుస్తున్నాయో.. ఆ తరహాలోనే అంతర్జాతీయ ఉత్తమ ప్రమాణాలను అనుసరించి ఇక్కడ కూడా అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజీ ట్యాంకులను ఏర్పాటుచేసి వరదనీటిని నిరోధించడం క్రమబద్దీకరించడం జరుగుతుంది భవిష్యత్తులో జరిగే పట్టణీకరణను కూడా పరిగణనలోకి తీసుకొని హెచ్ఎండిఏ పరిధిలో ఓ సమగ్ర డ్రెయినేజీ వ్యవస్థను రూపొందించి అమలు చేయడం జరుగుతుంది. ఘన వ్యర్థాలను సమర్ధవంతంగా ఉపయోగించుకొనే వ్యూహాన్ని అమలు చేస్తాం. అందరికీ అందుబాటులో వైద్యసేవలు. . కోవిడ్-19 చికిత్సను 'ఆరోగ్యశ్రీ' పథకంలో చేరుస్తాం. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన. ప్రతి 3 నెలలకు ఆర్ డబ్ల్యూ ఎల ద్వారా ఆడిటింగ్. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఇతర ఆసుపత్రులను ప్రత్యేకంగా మెరుగుపరుస్తాం. బస్తీ దవాఖానాల సంఖ్యను 450కి పెంచుతాం. బస్తీలలో ఆసుపత్రి పనివేళలను రాత్రి 9 వరకు పెంచుతాం. అన్ని ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా వైద్య పరీక్షలు, ఉచిత ఔషధాలు అందజేస్తాం. ప్రతి 100 దవాఖానాలకు ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిజ అన్ని ప్రజా ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులు, ట్రామా కేంద్రాలను ఆన్లైన్ ద్వారా అనుసంధానించి.. రక్తం, పరీక్షల సదుపాయాలు, డాక్టర్లు, స్పెష" తదితర సమాచారం పరస్పరం తెలుసుకొనేలా చేస్తాం. హైదరాబాద్ లో మలేరియా మరియు డెంగ్యూ జ్వరాల నిరోధానికి స్పెషల్ డ్రైవ్,   మురికివాడలలో ప్రత్యేక ఆరోగ్య క్యాంపుల్ని తరచుగా చేపడతాం. హైదరాబాద్ కు అన్ని వైపుల నుంచి అన్ని విధాలుగా రవాణా సదుపాయం. మహిళలకు, విద్యార్థులకు, దివ్యాంగులకు, వృద్ధులకు ఆర్టీసీ బస్సులు, మెట్రో ఎంఎంటిఎస్లలో ఉచిత రవాణా సదుపాయం,  ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచుతాం. జిహెచ్ఎంసి పరిధిలోని చివరి కిలోమీటర్ వరకు ఆర్టీసీ బస్సుల సేవలను విస్తరిస్తాం. మెట్రో రైలు సేవలను, ఎంఎంటీఎస్ సర్వీస్లను పాతనగరం, శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరిస్తాం, జా రవాణాకు సంబంధించి అన్ని సేవలకు ఒకే ట్రావెల్ కార్డు అందించి ప్రయాణీకులకు సౌలభ్యం వుంటుంది విద్య, గ్రంధాలయాలు కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు విచ్చలవిడిగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించి, క్రమబద్ధీకరించడానికి హైదరాబాద్ స్కూళ్ల పేరెంట్స్ అసోసియేషన్ (హెచ్ఎ పి ఏ) మరియు పౌరసంస్థలతో కలిసి పనిచేస్తాం. మధ్యలోనే చదువును వదిలివేసిన పిల్లలందర్నీ (డ్రాపవుట్స్) తిరిగి స్కూళ్లల్లో చేర్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడతాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక మరుగుదొడ్లు, మంచినీటి కుళాయిలు, సురక్షితమైన త్రాగునీటి సదుపాయం ప్రతి పాఠశాలలో నిర్ణీత కాలవ్యవధిలో ఏర్పాటు చేస్తాం. అన్ని పాఠశాలల్లో ఆరోగ్యం, వ్యాయామం, మానసిక వికాసం. మొదలైన అంశాలకు సంబంధించిన పాఠ్యాంశాలను బోధించేటట్లు చర్యలు చేపడతాం 150 డివిజన్లు అన్నింటిలో విద్యార్థులకు రీడింగ్ రూమ్ లు, ఇ లైబ్రరీలు, ఉచిత ఇంటర్నెట్ సదుపాయాలు కల్పిస్తాం. అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో పర్యావరణ హితమైన శానిటరీ ప్యాడ్లను ఉచితంగా అందించడానికి వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేస్తాం. అన్ని సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన. జిహెచ్ఎంసి లైబ్రరీలలో దివ్యాంగులకు లైబ్రరియన్ కొలువులు. గృహాలు అర్హత గలిగిన ఇల్లులేని వారందరికీ రెండు గదుల ఇండ్లు (డబుల్ బెడ్ రూమ్ హౌస్లు), ఇంటి జాగా ఉన్న కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడానికి 8 లక్షల రూపాయలు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అదనపు గది నిర్మాణం కొరకు రూ. 4 లక్షలు అందిస్తాం. 2020 నుంచి గృహ నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారులకు ఇండ్లు అందించే వరకు వారు చెల్లించే ఇంటి అద్దె భర్తీ చేయడానికి రూ. 60,000 అందిస్తామని పేర్కోన్నారు. 

Related Posts