YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రెడ్డమ్మ క్లీన్ స్వీప్ చేసేసిందేఁ

రెడ్డమ్మ క్లీన్ స్వీప్ చేసేసిందేఁ

తిరుపతి, ఫిబ్రవరి 23, 
రోజా వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేత. రోజా మాటల మనిషే కాదు. చేతల మనిషి కూడా. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీపై రోజా ఎలా విరుచుకుపడతారో? అదే తరహాలో ఎన్నికలంటే ఆమె తన వారిని గెలిపించుకునేందుకు శ్రమిస్తారు. అన్నింటిని పక్కన పెట్టి ఎన్నికలపైనే దృష్టి పెడతారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో నగరి నియోజకవర్గంలో రోజా తన పట్టు ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నారు.ఆర్కే రోజాకు అసలు మంత్రి పదవి దక్కాల్సి ఉంది. అయితే సామాజిక సమీకరణాలు. జిల్లాలో పరిస్థితుల కారణంగా రోజాకు మంత్రి పదవి దక్కలేదు. అయినా ఆమెలో ఉన్న అసంతృప్తిని గ్రహించి జగన్ ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిని వెంటనే ఇచ్చారు. క్యాబినెట్ హోదాగల ఈ పదవిలో గత ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. రోజా టార్గెట్ మంత్రిపదవే. అయితే అది అనుకున్నంత ఈజీ కాదన్నది ఆమెకు తెలియంది కాదు.ఇటీవల నగరి నియోజకవర్గంలో ఆర్కే రోజాకు సొంత పార్టీలోనే శత్రువులు ఎక్కువయ్యారు. ఆమెకు పొగ బెట్టే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు మంత్రులు రోజాను కట్టడి చేసేందుకు అన్ని రకాలగా పనిచేస్తున్నారు. కానీ రోజా లో మాత్రం ఇంకా కసి పెరిగిందే కాని ఏమాత్రం తగ్గలేదు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి ఆమె నగరి నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అధికారిక, ప్రయివేటు కార్యక్రమాలను కూడా రద్దు చేసుకుని పంచాయతీ ఎన్నికలపైనే దృష్టి పెట్టారు.ఫలితంగా తొలి విడత లోనే 22 పంచాయతీలను ఆర్కే రోజా ఏకగ్రీవం చేసుకోగలిగారు. నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 87 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ 64 ను గెలుచుకుంది. టీడీపీని 18 కే ఆర్కే రోజా పరిమితం చేయగలిగారు. ఇలా నగరి నియోజకవర్గంలో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తన పట్టు ఏమాత్రం తగ్గలేదని ఆర్కే రోజా నిరూపించుకున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే పంథా కొనసాగిస్తారంటున్నారు. మొత్తం మీద రోజా పట్టుబడితే వదలరంటారు. ఎన్నికల ఫలితాలు కూడా ఆమె పట్టుదలను నిరూపించాయి.

Related Posts