YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అచ్చెన్నా...అచ్చా దిన్ ఎప్పుడు

అచ్చెన్నా...అచ్చా దిన్ ఎప్పుడు

శ్రీకాకుళం, ఫిబ్రవరి 23, 
తెలుగుదేశం మూల పురుషుడు చంద్రబాబే రాజకీయంగా ఫల్టీలు కొడుతున్న కార్యక్షేత్రంలో అచ్చెన్నలు, బుచ్చెన్నలు ఎక్కడ నిలబడతారు. అందుకే పంచాయతీ ఎన్నికలతోనే ఏపీ కొత్త టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుకు పార్టీలో పంచాయతీ మొదలైందని అంటున్నారు. విజయదశమి శుభదినాన కొత్త పదవిని అప్పగించి అచ్చెన్నాయుడుకు కిరీటం నెత్తిన పెట్టిన చంద్రబాబు ఆయన నుంచి చాలానే ఆశించారు. ఏపీ మొత్తాన్ని కదిలించకపోయినా ఉత్తరాంధ్రా జిల్లాల వరకైనా సైకిల్ జోరు చేస్తే చాలు అనుకున్నారు. కానీ ఉత్తరాంధ్రాలో మాత్రం పసుపు శిబిరంలో పరవశాన్ని అచ్చెన్న తేలేకపోతున్నారుఇక 2019 ఎన్నికల వరకూ టీడీపీ వైపే ఉన్న ఉత్తరాంధ్రా జిల్లాల ప్రజానీకం ఒక్కసారిగా ఫ్లేట్ ఫిరాయించేశారు. ఫ్యాన్ నీడన చేరిపోయారు. దాంతో మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గానూ ఆరంటే ఆరు మాత్రమే టీడీపీకి దక్కాయి. ఇక తాజాగా పంచాయతీ పోరు చూసినా అలాగే సీన్ కనిపిస్తోంది. వైసీపీ మీద మోజు తీరలేదు అన్నట్లుగానే జనం తీర్పు ఉంది. మరో వైపు వైసీపీ జెండాను వీడేది లేదన్నట్లుగా కూడా జనం చెబుతున్న సందేశమూ అర్ధమవుతోంది.అచ్చెన్నాయుడు ప్రాభవం అంతా తన సొంత గ్రామం నిమ్మాడ వరకే పరిమితం అంటున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి పంచాయతీ వైసీపీకి జై కొట్టి ఏకగ్రీవంగా జెండా ఎత్తేసింది. మరో వైపు టెక్కలిలో వైసీపీ బలమైన రాజకీయ ప్రత్యర్ధిగా మారుతోంది. ఇక శ్రీకాకుళం పంచాయతీ పోరులో కూడా ఫ్యాన్ గిర్రున తిరిగింది. సైకిల్ కి ఆ మేరకు బ్రేకులు పడిపోయాయి. మొత్తానికి నిమ్మాడలో నాలుగు దశాబ్దల తరువాత ఎన్నికలు జరిగితే గెలిచామన్న సంబరం తప్పించి అచ్చెన్నకు పెద్దగా తృప్తి కలిగించింది ఏదీ లేదు అంటున్నారు.మరో వైపు విజయనగరం జిల్లాలో 2019 నాటి క్లీన్ స్వీప్ రిజల్ట్ ని వైసీపీ కంటిన్యూ చేస్తోంది. గత ఇరవై నెలలలో టీడీపీ ఇంకా దిగజారింది. మరిన్ని గ్రూపులు, వర్గ పోరులొ ఆ పార్టీ ఇబ్బందులు పడుతోంది. పంచయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల్లోనూ ఈ జిల్లా ముందుండి వైసీపీ సైడ్ తీసుకోవడంతో టీడీపీ పెద్దలకు ఏం చేయాలో పాలు పోవడంలేదు అంటున్నారు. ఇక విశాఖలోనూ సీన్ సేమ్ అన్నట్లుగానే కనిపిస్తోంది. మరో వైపు అచ్చెన్నాయుడు ఇలా అరెస్టులు బెయిల్ మీద రావడాలతోనే పుణ్యకాలం టోటల్ గా సరిపోతోంది అన్న సెటైర్లు కూడా సొంత పార్టీలో ఉన్నాయి.అచ్చెన్నాయుడు ఏలుబడిలో తెలుగుదేశానికి అచ్చే దిన్ ఎపుడు అన్నది మాత్రం తమ్ముళ్లకు అర్ధం కావడంలేదు. ఉత్తరాంధ్రాలో పెద్ద బీసీ అయిన అచ్చెన్నకు పట్టం కట్టాం కాబట్టి మొత్తమంతా మన వైపే అని చంద్రబాబు అనుకున్నట్లుగా కధ సాగడంలేదు. బీసీలు చైతన్యవంతులవుతున్నారు. రాజకీయంగా వారు అన్నీ చూస్తున్నారు. మరో వైపు వైసీపీ కూడా వారిని ఆకట్టుకునేలా వ్యూహాలు రచిస్తోంది. దాంతో అచ్చెన్నాయుడు వచ్చినా తెలుగుదేశం జాతకం మాత్రం మారడంలేదని అంటున్నారు.

Related Posts