YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ

హైదరాబాద్, ఫిబ్రవరి 23, 
రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక రసవత్తరంగా మారాయి.. హేమా హేమీలు భరిలో ఉండడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లు ఎవరికి దక్కుతాయనేది అసక్తిని రేపుతుంది..పీవీ నరసింహారావు కూతురు కు టిఆర్ఎస్ టికెట్ ఇవ్వడం తో హైదరాబాద్ ,రంగారెడ్డి ,మహాబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి.. బీజేపీ ,కాంగ్రెస్ లకు చెక్ పెట్టేందుకు పీవీ కుటుంబానికి టిక్కెట్ ఇవ్వడం తో ఆసక్తి కరంగా మారింది. హైదరాబాద్ -రంగారెడ్డి -మహబూబ్ నగర్  , ఖమ్మం -నల్గొండ -వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానాల నామినేషన్ గడువు ముగియనుంది... హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానాన్ని ఎప్పుడు గెలవని టిఆర్ఎస్ సరికొత్త వ్యూహం తో ముందుకెళ్తుంది.అసలు ఇక్కడ అభ్యర్థినే పెట్టారు.ఎన్నికల్లో పోటీ చేయరు అన్న ప్రచారానికి గులాబీ బాస్ చెక్ పెట్టారు. ఇతరుల కే మద్దతు తెలుపుతారని భావించినప్పటికీ అభ్యర్థి ని కరారు చేసింది.. అయితే ముందు గా టిక్కెట్ కోసం ప్రయత్నించిన ఆశావహులెవరికీ కాకుండా మాజీ ప్రధాని పీవీ కూతురు వాణీదేవికి టిక్కెట్ ఇవ్వడం తో ఈరోజు నామినేషన్ దాఖలు చేసారు..అయితే పీవీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన నేత ఆయన కూతురు కు టిఆర్ఎస్  టిక్కెట్ ఇవ్వడం గులాబీ బాస్ వ్యూహ రచనలో భాగం.. కాంగ్రెస్ సానుభూతి పరులు కూడా పీవీ కుటుంబానికి సానుకూలంగా  ఉండే అవకాశం ఉందని కేసీఆర్ ఆలోచన... మరోపక్క ఆశావాహులలో ఎవరిని నిలబెట్టిన టిఆర్ఎస్ ఓడిపోయే అవకాశం ఉండడంతో ..టిఆర్ఎస్ తరుపున మహిళకు టిక్కెట్ ఇవ్వడం తో అంచనాలు మారాయి..కాంగ్రెస్ నుంచి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానానికి మాజీ మంత్రి చిన్నారెడ్డి ,బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ,టిఆర్ఎస్ నుంచి సురభి వాణి దేవి , మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు  పోటీ లో ఉండడంతో ఇక్కడ ఛతుర్ముఖ పోటీ నెలకొంది... ఇక్కడ గతం లో ఎన్నడూ గెలవని టిఆర్ఎస్ ఈ సారి ఖచ్చితంగా గెలిచే లా గులాబీ బాస్ వ్యూహ రచన చేస్తున్నాడు..మూడు జిల్లా ల ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు .అంతర్గత విభేదాలను పక్కన పెట్టె సమన్వయం తో అందరు కలసి పనిచేసి ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుపే లక్ష్యం గా పనిచేయాలని నేతలకు గులాబీ బాస్ టార్గెట్ పెట్టారు. గెలుపే లక్ష్యం గా పనిచేయాలని నేతలకు సూచించారు..వరంగల్ ,ఖమ్మం నల్గొండ ఎన్నిక కూడా గట్టి పోటీ నెలకొంది.. రేపు పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ ధాఖలు చేయనున్నారు.. కాంగ్రేస్ నుంచి రాములు నాయక్ ,బీజేపీ నుంచి ప్రేమెందర్ రెడ్డి  , ప్రొ ఫ్రౌఫెసర్ కోదండరాం ,జయసారథి రెడ్డి ,రాణి రుద్రమ ,తీన్మార్ మల్లన్న బరిలో ఉండడంతో ఎన్నిక రసవత్తరంగా మారింది.గడిచిన మూడు నెలల నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నప్పటికీ హోరాహోరీ పోటీ తప్పేట్లు లేదు.. ఇప్పటికే కేటీఆర్ ఈ మూడు జిల్లా ల నేతలతో పలు దఫాలుగా సమావేశమ అంతర్గత విభేదాలు తొలగించేందుకు ప్రయత్నించారు.. అయితే సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం కావడం తో పల్లా రాజేశ్వర్ రెడ్డి ని గెలిపించడం టిఆర్ఎస్ కు బిగ్ టాస్క్ గా మారింది.దుబ్బాక ఓటమి ,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు దక్కక పోవడం తో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యం గా టిఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుంది...అందుకే సీఎం కేసీఆర్ తో పాటు కెటిఆర్ ఈ ఎన్నికల పై  పూర్తి దృష్టి సారించారు..

Related Posts