YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

యాత్రలకు వేళాయెరా...

యాత్రలకు వేళాయెరా...

హైదరాబాద్, ఫిబ్రవరి 23, 
తెలంగాణ కాంగ్రెస్‌లో పోటాపోటీ పాదయాత్రలకు నాయకులంతా సిద్దమయ్యారు. అచ్చంపేట నుండి రేవంత్ పాదయాత్ర ప్రారంభించాక.. పార్టీలో సీనియర్ నాయకులు కూడా యాత్రలు చేస్తామంటూ రెడీ అయ్యారు. నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి.. తాము పాదయాత్ర చేస్తున్నాం అని ప్రకటించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. తీరా గడువు దగ్గర పడేసరికి వాయిదా వేసుకున్నారు. ఊరించి..ఊరించి.. ఎందుకు ఉసూరుమనించారన్న చర్చ ఇప్పుడు పార్టీలో ఆసక్తికర చర్చకు కారణమైంది.మేము సైతం అన్నారు. పాదయాత్రలకు రెడీ అన్నారు. పాదయాత్రలతో సీనియర్‌ నేతలు కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారని అనుకున్నారు. షెడ్యూలూ ప్రకటించారు. రూట్‌ మ్యాప్ ఫిక్స్‌ చేసుకున్నారు..ఇప్పుడు వెనక్కి తగ్గారు నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల కోమటిరెడ్డి సొంత గ్రామం. బ్రాహ్మణవెల్లంల లిఫ్ట్ ఇరిగేషన్ కి 100 కోట్లు కేటాయిస్తే.. ప్రాజెక్టు పనులు పూర్తయ్యేవి. దీనికి తోడు ఎస్ ఎల్ బీసీ టన్నెల్ పనుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. బ్రాహ్మణవెల్లంల నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు కోమటిరెడ్డి. శనివారం నుండే పాదయాత్ర ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. కానీ తీరా ఇప్పుడు వాయిదా వేసుకున్నారు.జిల్లా పోలీసులు 25 మందితో మాత్రమే పాదయాత్ర చేసుకోవచ్చని అనుమతి ఇచ్చారట. కానీ 25 మందితో యాత్ర చేయడం ఏంటి..? అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన యాత్రను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ ఉండటంతో పోలీసులు ఎక్కువమందికి అనుమతి ఇవ్వలేదట. అయితే పర్మిషన్‌ ఇచ్చిన 25 మందితో యాత్ర చేయలా లేక తాను అనుకున్నట్లు భారీగా యాత్రను కొనసాగించాలా అని ఆలోచించిన కోమటిరెడ్డి.. చివరకు యాత్రను వాయిదా వేయాలనే నిర్ణయించుకున్నారు. కానీ అనుమతి ఇచ్చినంత మందితోనే యాత్రను మొదలుపెడితే బాగుండేదని కాంగ్రెస్‌ వర్గాలు అనుకుంటున్నాయట.మరో సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి  పాదయాత్ర చేయడానికి సిద్దమయ్యారు. సదాశివపేటలో యాత్ర మొదలుపెట్టి.. గన్ పార్క్ దగ్గర ముగించాలని నిర్ణయించుకున్నారు. కానీ జగ్గారెడ్డి పాదయాత్ర కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగలేదు. జగ్గారెడ్డికి యాత్ర చేయాలని ఉన్నా.. ఆయనకు కొన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాదయాత్ర చేస్తే ఓ రేంజ్ లో ఉండాలి కానీ… నడిచామా అంటే నడించాము అనేలా ఉండొద్దనేది జగ్గారెడ్డి ఆలోచన. అందుకే పాదయాత్రను ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారట. కానీ చెప్పిన సమయానికి పాదయాత్ర చేయకపోవడంతో క్యాడర్ కొంత నారాజ్ అయినట్లు సమాచారం.ఇప్పటికే రెండు సార్లు యాత్ర వాయిదా వేసుకున్నారు జగ్గారెడ్డి. సంగారెడ్డిలో భారీ సభ అనుకున్నారు.. అదీ వాయిదా పడింది. చాలా కాలంగా జగ్గారెడ్డి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద, తన నియోజకవర్గ సమస్యలపై ఆందోళన బాట పట్టాలని అనుకున్నారు. అయితే కార్యాచరణ ఎప్పుడు, ఎలా అమలు చేస్తారనే దానిపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి ఇద్దరూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలే. ఇద్దరూ మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న నాయకులే. కానీ, యాత్రలు అంటూ ప్రకటించి.. ఇప్పుడు వాయిదా వేసుకోవడం కాంగ్రెస్‌ కేడర్‌ను నిరాశపరుస్తోంది.
ఒకరు చేస్తుంటే ఇంకొకరు రెడీ అంటారు. కానీ తీరా సమయం దగ్గర పడ్డాక… సైలెంట్ అవుతారు..తమ పార్టీ నేతల దగ్గర ఇదే మైనస్ అని నేతలు చర్చించుకుంటున్నారు.

Related Posts