YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఫైర్ బ్రాండ్లు ... సైలెంట్

ఫైర్ బ్రాండ్లు ... సైలెంట్

విజయవాడ, ఫిబ్రవరి 26, 
ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు.. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మగ‌డ్డ ర‌మేశ్ కుమార్ దూకుడు జెట్ రాకెట్ వేగంతో ఉండ‌డం.. మ‌రో వైపు కోర్టుల నుంచి కూడా పెద్దగా ఉప‌శ‌మ‌నం లేక‌పోవ‌డంతో అధికార పార్టీ వైసీపీ నేత‌ల్లో గుబులు రేగుతోంది. కీల‌క నాయ‌కులు ఎవ‌రితోనైనా ఢీ అంటే ఢీ అన‌గ‌లిగే నాయ‌కులు మంత్రులు కూడా ఇప్పుడు ఇబ్బంది ప‌డుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, యంత్రాంగం అంతా.. నిమ్మగ‌డ్డ చేతిలో ఉండ‌డం, ఆయ‌న‌కు ర‌క్షణ‌గా రాజ్యాంగం ఉండ‌డం పైగా కోర్టు కూడా మ‌రింత విస్తృత అధికారాలు వినియోగించాల‌ని చెప్పడం వంటివి వైసీపీ నేత‌ల్లో త‌ర్జన భ‌ర్జన‌కు కార‌ణంగా మారుతున్నాయి.మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై ఎన్నిక‌ల సంఘం కొర‌డా ఝ‌ళిపించింది. ఈ క్రమంలో ఆయ‌న కోర్టుకు వెళ్లినా పెద్దగా ఉప‌శ‌మ‌నం ల‌భించ‌లేదు. పైగా ఎస్ ఈసీ నిమ్మగ‌డ్డను ఏమీ అన‌వద్దని, ఇక‌పై ఆయ‌న విష‌యంలో జోక్యం చేసుకోన‌ని సంజాయిషీ చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. ఇది నిజంగా పెద్దిరెడ్డి వంటి సీనియ‌ర్లనే ఇరుకున పెట్టిన ఘ‌ట‌న‌గా వైసీపీలో చ‌ర్చ సాగుతోంది. ఇక‌, కృష్ణా జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్యే జోగి ర‌మేష్ విష‌యంలోనూ ఇలాంటి ప‌రిణామ‌మే జ‌రిగింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్యల‌పై ఆగ్రహించిన నిమ్మగ‌డ్డ ఆయ‌న మీడియా ముందుకు, స‌భ‌ల్లోనూ మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఆయ‌న కోర్టుకు వెళ్లినా అనుకూలంగా తీర్పు రాక‌పోగా నిమ్మగ‌డ్డను, ఎస్ఈసీని ఏమీ అనొద్దని తీర్పు వ‌చ్చింది.ఇక‌, ఫైర్ బ్రాండ్ మంత్రి.. కొడాలి నాని విష‌యంలో ఎస్ఈసీ మ‌రింత తీవ్రంగా స్పందించింది. ఆయ‌న‌పై ఏకంగా.. మీడియాతో మాట్లాడొద్దంటూ.. నిషేధంతో పాటు.. ఏకంగా క్రిమిన‌ల్ కేసులు కూడాన‌మోదు చేయాల‌ని నిమ్మగ‌డ్డ ఆదేశించారు. దీంతో ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వైసీపీ నాయ‌కులు నోరు ఎత్తేందుకు కూడా భ‌య‌ప‌డుతున్నారు. “మేం నోరు విప్పడం పెద్ద విష‌యం కాదు. మాకు స‌బ్జెక్టు ఉంది. కానీ, ఏమైనా జ‌రిగితే.. ఇప్పటికిప్పుడు మేం ఇబ్బందుల్లో ప‌డాలి. కాపాడేవారు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. “అని వైసీపీ పెద్దలు ఈ విష‌యాల్లో మౌనంగా ఉండ‌డాన్ని ప‌రోక్షంగా నాయ‌కులు ప్రశ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం.దూకుడు పెంచితే చిక్కుల్లో ప‌డ‌తామ‌ని.. త‌మ‌ను ప‌ట్టించుకునేవారు కూడా ఎవ‌రూ లేర‌ని నాయ‌కులు కొంద‌రు ఆవేద‌న వ్యక్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోనే అనేక మంది సైలెంట్ అయిపోవ‌డం గ‌మ‌నార్హం. పార్టీలో ఎంతో మంది కార్యద‌ర్శులు, ప్రధాన కార్యద‌ర్శులు ఉన్నారు. కొంద‌రు ఫైర్ బ్రాండ్లు అన్న ముద్ర వేయించుకున్నారు. అయినా కూడా ఈ టైంలో కాంట్రవ‌ర్సీ లేకుండా త‌మ పార్టీ నేత‌ల‌ను, మంత్రుల‌కు స‌పోర్ట్‌గా ఎలా ? విజ్ఞత‌తో స‌పోర్ట్ చేయాల‌న్న ఆలోచ‌న, ప్లానింగ్ కూడా వీరికి కొర‌వ‌డిన‌ట్టే ఉంది. అందుకే ఎవ‌రికి వారు త‌మ‌కెందుకులే అన్న ధోర‌ణితోనే ఉంటున్నారు. ఇది పార్టీపైనా జ‌గ‌న్ నాయ‌క‌త్వంపైనా ప్రభావం ప‌డుతుందా ? అనే సందేహాలు కూడా వ్యక్తమ‌వుతున్నాయి. అదే టీడీపీలో వ్యవ‌స్థల‌పై విమ‌ర్శలు చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు, వ్యవ‌స్థల‌నే ప్రశ్నించాల్సి వ‌చ్చిన‌ప్పుడు కూడా సీనియ‌ర్ నేత‌లు కాంట్రవ‌ర్సీ లేకుండా ఎటాక్ చేసేవారు. వైసీపీలో చాలా మందికి ప‌ద‌వులు ఉన్నా.. ఉప‌యోగం లేని నేతలుగా మిగిలి పోతున్నారు
 

Related Posts