YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సీఎం కేసీఆర్‌కు పుట్టా మధు సన్నిహితుడు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌కు పుట్టా మధు సన్నిహితుడు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌ ఫిబ్రవరి 26 సీఎం కేసీఆర్‌కు పుట్టా మధు సన్నిహితుడు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పుట్టా మధుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారు పోలీస్‌ కమిషనర్‌ ఆడియో టేపులు బయటపెట్టిన ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు ఆ రోజు డేటా ఎందుకు కలెక్ట్‌ చేయలేదు: శ్రీధర్‌ బాబు  లాయర్‌ వామన్‌రావు దంపతుల హత్యపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు స్పందించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఉదయం గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు.. లాయర్ వామన్‌రావు దంపతుల హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే లాయర్‌ దంపతులు అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారన్నారు.ఓ కేసు నిమిత్తం హైకోర్టులో కేసు వేసినందుకే వీరిని చంపారని, పోలీసులు స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలకు వత్తాసు పలుకుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ‘‘పుట్టా మధుకు స్థానిక పోలీస్‌ కమిషనర్‌ తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ఆడియో టేపులు బయటపెట్టిన ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. సీఎం కేసీఆర్‌కు పుట్టా మధు సన్నిహితుడు’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక పోలీసులతో  కేసు ముందుకు సాగదన్నారు. నేరుగా కోర్టు ద్వారా విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరామని ఆయన వెల్లడించారు. ఈ హత్య ఘటనపై సీజేఐ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతికి లేఖ రాసామని పేర్కొన్నారు.లాయర్‌ వామన్‌రావు దంపతుల హత్య చాలా బాధాకరమని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు అన్నారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా అందరూ బాగుండాలని కోరుకున్నాం. కానీ గుంజపడుగు గ్రామానికి చెందిన ఇద్దరు లాయర్ల హత్య జరగడం దురదృష్టకరమన్నారు. శీలం రంగయ్య అనే దళితుడు లాకప్ డెత్‌పై వామన్‌రావు దంపతులు కోర్టులో కేసు వేశారన్నారు. స్థానిక పోలీస్ కమిషనర్ పట్టించుకోవడం లేదని.. కోర్టు పట్టించుకోవాలని వారు కోరారని, కానీ వారికి ప్రాణాలే పోయాయని పేర్కొన్నారు. రామాలయం భూమి, అంతకుముందు రెండు మూడు ఘటనలకు లింక్ పెడుతున్నారని, కేసును నీరుగార్చే ప్రమాదం ఉందన్నారు. టెక్నాలజీ పెరిగిందని కేటీఆర్ చెబుతున్నారని, ఆ సెల్‌ టవర్‌ కింద ఉన్న ఆ రోజు డేటా ఎందుకు కలెక్ట్‌ చేయలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాస్తోంది.వామన్ రావు దంపతుల హత్య కేసులో లోకల్ పోలీసులపై మాకు నమ్మకం లేదు..ఈ కేసును సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతున్నాము...రామ్మోహన్ రావు చనిపోయేటప్పుడు నిందితుల పేర్లు చెప్పాడు అయినా వారిపై చర్యలు తీసుకోవడం లేదు..దానినే మరణవాంగ్మూలం గా తీసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు.

Related Posts