YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దువ్వాడ శ్రీనివాస్ కు రేర్ ఫీట్

దువ్వాడ శ్రీనివాస్ కు రేర్ ఫీట్

శ్రీకాకుళం, ఫిబ్రవరి 27, 
శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ నేత, బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ కి పంచాయతీ బహుమతి దక్కింది. టెక్కలిలో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుని ఎదుర్కొనడంతో దువ్వాడ నూరు శాతం సక్సెస్ అయ్యారని జగన్ భావించారు. అందుకే ఆయనను ఏరి కోరి మరీ పెద్దల సభలో కూర్చోబెట్టారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను మలుపు తిప్పిన ఈ నియామకం రాబోయే రోజుల్లో మరిన్ని సామాజిక మార్పులకు దారితీస్తుందని అంటున్నారు.దువ్వాడ శ్రీనివాస్ చట్టసభలలో ప్రవేశించాలన్న ఉబలాటం ఈనాటిది కాదు, రెండు దశాబ్దాలుగా ఆయన అలుపెరగని రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నారు. నాడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు స్వపక్షంలోని వారితో పాటు విపక్షంలో ఉన్న టీడీపీ మీద కూడా ఒకేసారి యుద్ధం చేసిన ఘనత దువ్వాడదే. వైస్సార్ చలువతో అప్పట్లో జెడ్పీటీసీగా గెలిచిన ఆయన ఎమ్మెల్యే మాత్రం కాలేకపోయారు. సొంత కాంగ్రెస్ పార్టీలోనే ఆయనకు ఎక్కడికక్కడ బ్రేకులు పడిపోయేవి. ఇక నాడు కాంగ్రెస్ లోని పెద్దలు, టీడీపీ వారూ కలసి కూడా దువ్వాడ దూకుడుని నియంత్రించారని అంటారు.ఇదిలా ఉంటే ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళి 2009 ఎన్నికల్లో టెక్కలి నుంచి పోటీ చేసినా కూడా దువ్వాడ శ్రీనివాస్ కు టైమ్ క‌లసిరాలేదు. ఆ తరువాత జగన్ పార్టీ పెట్టడంతో ఈ వైపుగా వచ్చిన ఆయన 2014లో టెక్కలి నుంచి పోటీ చేసి ఓడారు. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ సీటుకు పోటీ పడి స్వల్ప తేడాతో పరాజయం పాలు అయ్యారు. ఇపుడు టెక్కలికి షిఫ్ట్ అయి తన చిరకాల కోరిక అయిన ఎమ్మెల్యే పదవిని అక్కడే దక్కించుకోవాలని, కింజరాపు కుటుంబాన్ని ఓడించాలని దువ్వాడ తెగ కసిగా పనిచేస్తున్నారు. ఆయనకు జగన్ ఇచ్చిన అభయంతో పోరాటం సాగిస్తున్నారు. ఇపుడు అదే వరంగా మారి ఏకంగా ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇపుడు మరింత రెట్టించిన ఉత్సాహంతో దువ్వాడ శ్రీనివాస్ అచ్చెన్న మీద పోరు సలుపుతారు అంటున్నారు.జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణలకు జగన్ తెరతీశారు. జనాభాపరంగా అత్యధికంగా ఉన్నా కూడా రాజకీయంగా ముందుకు రాలేకపోతున్న కాళింగ సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడం ద్వారా రానున్న రోజుల్లో వారిదే ముందుంచి రాజకీయ నడపాలని జగన్ భావిస్తున్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ దూకుడు మామూలుగా ఉండదు, ఆయన ఏ పదవీ లేనప్పుడే రెచ్చిపోయేవారు. ఇపుడు ఏపీలో అధికారంలో వైసీపీ ఉంది. చేతిలో ఎమ్మెల్సీ పదవి ఉంది. మరి అచ్చెన్న కోటలో పాగా వేయడమే తరువాయి. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు ఇక్కడ సాధించిన దువ్వాడ శ్రీనివాస్ ఈ రేర్ ఫీట్ ని కూడా చేసి చూపిస్తారు అని జగన్ సహా అంతా

Related Posts