YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కేడర్ కు నమ్మకం కల్గించిన ఎమ్మెల్సీ ఎన్నికలు

కేడర్ కు నమ్మకం కల్గించిన ఎమ్మెల్సీ ఎన్నికలు

తిరుపతి, ఫిబ్రవరి 27, 
నిజంగా ఇప్పుడు పార్టీలో నేతలు అదే నమ్ముతున్నారు. జగన్ ను నమ్ముకుంటే పదవి ఖాయమని అందరూ విశ్వసిస్తున్నారు. ఇది జగన్ పై ఉన్న నమ్మకం. ఆయన పక్కన ఉంటే ఎప్పటికైనా పదవి రాక తప్పదన్న సంకేతాలను జగన్ బలంగా ఇచ్చారు. ఒకరిద్దరికి హామీ ఇచ్చి జగన్ ఇప్పుడు ఇవ్వకపోయినా వారి రాజకీయ భవిష్యత్ కు మాత్రం లోటు ఉండదు. నేతల విషయంలో ఇంత శ్రద్ధ కనపర్చే జగన్ క్యాడర్ పట్ల కూడా అలాగే నేతలు చూపించేలా చర్యలు తీసుకోవాలన్న కామెంట్స్ బలంగా విన్పిస్తున్నాయి.ఆరుగురు ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేయడంలోనే జగన్ పార్టీ విధేయులకు, సెంటిమెంట్ కు పట్టం కట్టారు. ఆరుగురు ఎమ్మెల్సీల్లో ఇద్దరికి పదవులను కట్టబెట్టడంలో సానుభూతి ఉంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో ఆయన తనయుడు బల్లి కల్యాణ చక్రవర్తికి, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మరణంతో ఆయన తనయుడు చల్లా భగీరధరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈ రెండు ఎమ్మెల్సీ పదవులు కేవలం సానుభూతితోనే జగన్ ఇచ్చారు.ఇక పార్టీ విధేయత విషయాన్ని కూడా జగన్ పక్కన పెట్టలేదు. దువ్వాడ శ్రీనివాస్ పార్టీ ప్రారంభం నుంచి వైసీపీలోనే ఉన్నారు. ఆయనకు గత ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ కూడా ఇచ్చారు. కానీ గెలవలేకపోయారు. తిరిగి టెక్కలి వైసీపీ ఇన్ ఛార్జిగా నియమించారు. దువ్వాడ శ్రీనివాస్ ఆర్థికంగా పార్టీని నమ్ముకుని ఎంతో నష్టపోయారు. దీంతో జగన్ దువ్వాడ శ్రీనివాస్ కు టిక్కెట్ ఇచ్చారు. విజయవాడ మాజీ కార్పొరేటర్ కరీమున్నీసా కూడా విధేయత కారణంగానే ఎమ్మెల్సీ పదవి పొందారు.మరో ఎమ్మెల్సీ అయిన సి.రామచంద్రయ్య సయితం వివిధ పార్టీలు మారి వచ్చినా ఆయన గత ఎన్నికల నాటి నుంచి పార్టీని నమ్ముకునే ఉన్నారు. వయసులో పెద్ద అయిన సి.రామచంద్రయ్య నిజానికి ఈ పదవి తనకు వస్తుందని ఊహించలేదు. కడప జిల్లా కావడంతో అక్కడ బలమైన నేతలు ఉండటంతో తనకు పదవి రాదని సి.రామచంద్రయ్య ఆశలు వదిలేసుకున్నారు. కానీ అనూహ్యంగా జగన్ సి.రామచంద్రయ్య పేరును ఖరారు చేశారు. సామాజికవర్గాల సమీకరణలో భాగంగా మరో ఎమ్మెల్సీ మహ్ద్ ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. సో.. జగన్ ను నమ్ముకుంటే.. జగన్ వారిని నమ్మితే పదవి ఖాయమని ఈ ఎంపిక ద్వారా తేలిపోయింది.

Related Posts