YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కాంగ్రెస్ కు అవకాశం వచ్చేట్టుందే..

కాంగ్రెస్ కు అవకాశం వచ్చేట్టుందే..

లక్నో,ఫిబ్రవరి 27, 
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ బలోపేతం అయ్యేందుకు పార్టీ అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించారు. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పట్టు సాధిస్తేనే దేశ వ్యాప్తంగా పార్టీ మనుగడ ఉంటుంది. ఈసారి ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ చాలా హోప్స్ పెట్టుకుంది.ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు దశాబ్దాలు దాటుతుంది. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు వరసగా అధికారంలో ఉంటూ వస్తున్నాయి. మూడు పార్టీల పాలనను ప్రజలు చూశారు. కానీ అభివృద్ధి ఏమాత్రం లేకపోవడంతో ఈసారి కాంగ్రెస్ పట్ల ప్రజలు మొగ్గు చూపుతారన్న అంచనాలో ఆ పార్టీ అధినాయకత్వం ఉంది. ఇందుకు ప్రియాంక గాంధీ కృషి కూడా తోడ్పడుతుందని భావిస్తున్నారు.ప్రియాంక గాంధీ ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ ను చుట్టి వస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమీక్షలు చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే ప్రియాంక స్పందించి అక్కడకు వెళ్లి వస్తున్నారు. బాధితులకు అండగా నిలబడుతున్నారు. ప్రియాంక గాంధీ యాక్టివ్ కావడంతో ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం కన్పిస్తుందని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించడం విశేషం.ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022లో జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటినుంచే ప్రియాంక గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రియాంక గాంధీ గతంలో ఎన్నడూ లేని విధంగా సమస్యల పై స్పందించడమే కాకుండా మఠాలను కూడా సందర్శిస్తుండం చర్చనీయాంశమైంది. ఇటీవల ప్రియాంక గాంధీ ప్రయాగ్ రాజ్ కు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి స్వరూనంద సరస్వతి ఆశ్రమాన్ని సందర్శించి ఆశీస్సులు పొందారు. ఇలా ప్రియాంక గాంధీ సమస్యలపై యోగి సర్కార్ ను ప్రశ్నిస్తూనే అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Related Posts