YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సత్ఫలితాలు ఇస్తున్న ప్రీ పెయిడ్ మీటర్స్

సత్ఫలితాలు ఇస్తున్న ప్రీ పెయిడ్ మీటర్స్

సత్ఫలితాలు ఇస్తున్న ప్రీ పెయిడ్ మీటర్స్
హైదరాబాద్, ఫిబ్రవరి 27, 
గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన విద్యుత్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రయివేటు కార్యాలయాల్లోనూ ఏర్పాటుకు డిస్కం అధికాలు అడుగులు ముందుకేస్తున్నారు. ఇప్పటికే దాదాపు గ్రేటర్‌ వ్యాప్తంగా 21వేల వరకు మీటర్లు అమర్చినట్టు సమాచారం. మిగతా ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లోనూ ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి.గ్రేటర్‌లోని 9 సర్కిళ్లలో పరిధిలో మొత్తం 52.50 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందు లో 46 లక్షల వరకు గృహ వినియోగ కనెక్షన్లు ఉన్నాయి. కాగా ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యు త్‌ బకాయిలు పెరిగిపోతున్నాయి. ఎప్పటిక ప్పుడు బిల్లులు చెల్లించకపోవడంతో వేలకు వేలు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. ఇలాంటి మొం డి బకాయిలకు చెక్‌ పెట్టడానికి డిస్కం ప్రీపెయి డ్‌ మీటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 9 సర్కిళ్లలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ప్రీపెయిడ్‌ మీటర్ల ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక్కడ సత్ఫలితాలు ఇస్తుండటంతో ఇదే మాదిరిగా ప్రయివేటు కార్యాలయాల్లోనూ ఏర్పాటు చేయడా నికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మీటర్లను ఎంత పెంచితే అంత మొండి బకాయి లను తగ్గించుకోవచ్చు అనే ఆలోచనలో ఉండి డిస్కం. పాత బకాయిలు అనే మాటే లేకుండా ముందుగా డబ్బులు చెల్లించాకే విద్యుత్‌ను సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రయివేటులోనూ విజయవంతమైతే ఇక మొండి బకాయిలకు చెక్‌ పడినట్టేప్రతినెలా ఐఆర్‌ పోర్టు మీటర్లతో విద్యుత్‌ బిల్లులు జారీ చేస్తూ వాటిని వసూలు చేస్తు న్నారు. దీంతో ఆయా సర్కిళ్లలలో బిల్లులు వేలల్లో పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో త క్కువ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్న డివిజన్‌ను ఎంపిక చేసుకుని ఆ డివిజన్‌లో పూర్తి స్థాయిలో ప్రీ పెయిడ్‌ మీటర్లను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా డిస్కం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రీ పెయిడ్‌ మీటర్ల ఏర్పాటుతో నెల ముందుగానే వినియోగదారులు తమ మీటర్లను రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రీచార్జీ చేసుకున్న డబ్బులు అయిపోయే వరకు విద్యుత్‌ను వాడు కునే వీలుంటుంది. రీచార్జు డబ్బులు అయిపో గానే విద్యుత్‌ సరఫరా అటోమెటిక్‌గా నిలిచిపో తుంది. ఆ తర్వాత మళ్లీ రీచార్జ్‌ చేసుకుంటే యధావిధగా సరఫరా అవుతుంది. ఈ మీటర్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మొండి బకాయిలు తగ్గిపోవడంతోపాటు డిస్కంకు ఆదాయం కూడా పెరిగే అవకాశాలున్నాయి.ప్రభుత్వ కార్యాలయాల్లో పేరు కుపోతున్న మొండి బకాయిలకు చెక్‌ పెట్టేలా విద్యుత్‌శాఖ ప్రీపెయిడ్‌ మీటర్లను అందుబా టులోకి తీసుకొచ్చింది. వీటితో ఆయా ప్రభుత్వ శాఖలు విద్యుత్‌శాఖకు ముందుగానే విద్యుత్‌ సరఫరాకు ముందుగానే కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ముందస్తు చెల్లింపు లతో విద్యుత్‌శాఖకు మొండి బకాయిల బెడద తప్పనుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పాత బకాయిలు అనే మాటే లేకుండా పోతుందని అధి కారులు భావిస్తున్నారు. ఇదే తరహాలో ప్రయి వేటు కార్యాలయాల్లోనూ ప్రీ పెయిడ్‌ మీటర్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తే విద్యుత్‌ వ్యవస్థలో మరిన్ని మార్పులు వచ్చే అవ కాశాలున్నాయని అదికారులు అంచనా వేస్తు న్నారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

Related Posts