YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పార్టీ అభ్యర్దులను గెలిపించాలి మంత్రి అళ్ల నాని

పార్టీ అభ్యర్దులను గెలిపించాలి మంత్రి అళ్ల నాని

పార్టీ అభ్యర్దులను గెలిపించాలి
మంత్రి అళ్ల నాని
ఏలూరు ఫిబ్రవరి 27 
ఏలూరు కార్పొరేషన్ లో జరగనున్న ఎన్నికల కురుక్షేత్రంలో వైయస్సార్సీపి కార్పొరేట్ అభ్యర్థులు అన్ని డివిజన్లలో ఘన విజయం సాధించడానికి సమన్వయంతో, సమిష్టిగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సూచించారు. ఎన్నికలలో అభ్యర్థులతో పాటు నాయకులు కార్యకర్తలు అకుంఠిత దీక్షతో, పట్టుదలగా గెలుపే లక్ష్యంగా పని చేయాలని ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి ప్రతి ఒక్కరి ని ఓట్లు అభ్యర్థించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలను పురస్కరించుకొని సరికొత్త విధానంతో పార్టీ నాయకులు క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపే విధంగా డివిజన్ల వారీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు, ఆ డివిజన్ల ముఖ్యనాయకులు, బూత్ ఇన్ఛార్జీలతో ఏలూరులోని పవర్ పేట ఎస్ఎంఆర్ పెదబాబు క్యాంప్ ఆఫీసులో శనివారం విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ప్రతి డివిజన్కు సంబంధించి అభ్యర్థి, నాయకులు, బూత్ ఇన్చార్జి లకు మంత్రి ఆళ్ల నాని సూచనలు చేశారు, ఏమాత్రం ఏమరుపాటుగా ఉండకూడదని ప్రతి నిత్యం ప్రజలతో మమేకమవుతూ వాటర్ లో దగ్గరకు వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నవరత్నాల పథకాలను సమగ్రంగా వివరించి ఏలూరు కార్పొరేషన్ మరింత అభివృద్ధి చెందడానికి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడి 20 నెలల కాలంలో ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని 90% పైబడి అమలు చేశారని, అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, రైతులకు వైయస్సార్ సున్నా వడ్డీ, పొదుపు సంఘాల మహిళలకు చేయూత, వైయస్ఆర్ సున్నా వడ్డీ చెల్లింపులు, వైఎస్సార్ రైతు భరోసా, వైయస్సార్ నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, జగనన్న తోడు, ఆరోగ్యశ్రీ,పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు అందడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని చర్యలు తీసుకున్నారని గతంలో ఎన్నడూ లేని విధంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 31 వేల మంది పైగా పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని ప్రతినెల ఒకటో తేదీనే పెన్షన్లు ఇళ్లకు తీసుకువెళ్లి ఇచ్చిన ఘనత వైయస్సార్సీపి ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు గానీ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ కూడా అలసత్వం లేకుండా పార్టీ అభ్యర్థులు విజయానికి అహర్నిశలు కృషి చేయాలని ప్రచారంలో ఎక్కడ వెనుకంజ వేయకుండా ప్రజల్లోకి చొచ్చుకొని  వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలని తాను ప్రచారానికి వచ్చే సమయానికి అభ్యర్థులు ప్రచారాన్ని రెండు దఫాలుగా పైబడి పూర్తి చేయాలని మంత్రి ఆళ్ల నాని దిశా, నిర్దేశం చేశారు. డివిజన్ల పార్టీ ఇంచార్జ్ లు ఎప్పటికప్పుడు డివిజన్లో పర్యటిస్తూ అభ్యర్థులకు సపోర్టుగా ఆర్ డివిజన్లో నాయకులను కార్యకర్తలను సమన్వయం చేస్తూ గడపగడపకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ అని గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో వైయస్సార్సీపి కార్పొరేట్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేయాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు.

Related Posts