YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

భరత్ , లావులకు కీలక బాధ్యతలు

భరత్ , లావులకు కీలక బాధ్యతలు

విజయవాడ, మార్చి 3,
అధికార వైసీపీకి ఉన్న ఎంపీల్లో ఇద్దరు కీల‌క యువ ఎంపీల‌కు స్వయంగా సీఎం జ‌గ‌న్ కొన్ని బాధ్యత‌లు అప్పగించార‌నే ప్రచారం జ‌రుగుతోంది. వైసీపీలో పార్టీ పార్లమెంట‌రీ అధ్యక్షుడు.. విజ‌య‌సాయిరెడ్డి అన్నీ తానై వ్యవ‌హారాన్ని చూసుకుంటున్నారు. దీంతో ఎవ‌రు ఏం మాట్లాడాల‌న్నా.. ఆయ‌నే చెబుతున్నా రు. అటు రాజ్యస‌భ‌, ఇటు లోక్ స‌భ ఎంపీలు అంద‌రూ కూడా సాయిరెడ్డి క‌నుస‌న్నల్లోనే న‌డుస్తున్నారు. అయితే ఇద్దరు ఎంపీల‌కు మాత్రం స్వయంగా జ‌గ‌నే వ‌ర్క్ అప్పగించార‌ని వైసీపీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.  వీరిలో ఒక‌రు న‌ర‌స‌రావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవ‌రాయులు, మ‌రొక‌రు రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌రత్. ఈ ఇద్దరికీ స్వయంగా జ‌గ‌నే ప‌ని అప్పగించార‌ని అంటున్నారు. టీడీపీలో ఉన్న ముగ్గురు ఎంపీల‌తో పాటు రాజ్యస‌భ స‌భ్యుడు క‌న‌కమేడ‌ల ర‌వీంద్ర కుమార్ వంటివారికి చెక్ పెట్టేందుకు లావును వినియో గించుకుంటున్నార‌ని కొన్నాళ్లుగా వార్తలు వ‌స్తున్నాయి. టీడీపీకి ఉన్న ఎంపీల్లో ముగ్గురు క‌మ్మ ఎంపీలే ఉన్నారు. ఇక రామ్మోహ‌న్ యువ ఎంపీ కావ‌డంతో ఇటు లావు క‌మ్మ + యువ ఎంపీగా ఉన్నారు. అందుకే వీరిని టార్గెట్ చేసే బాధ్యత‌ను లావుపైనే పెట్టార‌ట‌. కేవ‌లం.. టీడీపీకి చెక్ పెట్టేందుకు మాత్రమే కాకుండా ప్రధానితో పార్టీ నేత‌ల‌కు అనుసంధానం ఉండేలా చూసే బాధ్యత‌ల‌ను కూడా ఇటీవ‌ల లావుకు అప్పగించాల‌ని యోచిస్తున్నట్టు తెలిసింది.ఉన్నత విద్యావంతుడు కావ‌డంతో పాటు మూడు భాష‌ల్లో అన‌ర్గళంగా మాట్లాడ‌డం, కాంట్రవ‌ర్సీల‌కు దూరంగా ఉండ‌డం, ఏపీలో ప‌లు కీల‌క ప్రాజెక్టుల‌పై ఢిల్లీ స్థాయిలో త‌న వంతుగా లాబీయింగ్ చేస్తుండ‌డంతో జ‌గ‌న్‌కు లావుపై గురి కుదిరింద‌ట‌. నిజానికి ఈ బాధ్యతలు పార్టీకి అత్యంత కీల‌కం. ఇప్పటి వ‌ర‌కు సాయిరెడ్డికే ప‌రిమిత‌మైన ఈ బాధ్యత‌ను త ప్పించి.. లావుకు అప్పగించ‌డంపై ఇటీవ‌ల జ‌గ‌న్ స‌మాలోచ‌న‌లు చేశారు. ఆంగ్ల ప‌రిజ్ఞానం ఎక్కువ‌గా ఉన్న యువ‌కుడు కావ‌డం పైగా ప్రధాని మోడీ వంటివారికి కూడా లావు వంటి యువ ఎంపీల‌పై మంచి అభిప్రాయం ఉండ‌డం లావుకు ప్లస్. వ‌చ్చే నెల‌లో ప్రారంభ‌మ‌య్యే బ‌డ్జెట్ త‌దుప‌రి స‌మావేశాల్లోనే దీనికి బీజం ప‌డుతుంద‌ని తెలుస్తోంది.ఇక‌, మ‌రో ఎంపీ.. మార్గాని భ‌ర‌త్ విష‌యంలోనూ జ‌గ‌న్ సానుకూలంగా ఉన్నారు. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన యువ ఎంపీ కావ‌డంతో బీసీల‌కు పార్టీని చేరువ చేసేందుకు వారి స‌మ‌స్యల‌పైనా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇత‌ర అంశాల‌కు సంబంధించిన బాధ్యత‌ల‌ను ఆయ‌న‌కు అప్పగించాల‌ని ఇప్పటికే నిర్ణయించారు. ఇటీవ‌ల ఆయ‌న ఢిల్లీలోనూ కేంద్ర పెద్దల‌ను స్వయంగా క‌లిసి జ‌గ‌న్ నాడిని వినిపించార‌ని ప్రచారం జ‌రుగుతోంది. ఇప్పటి వ‌ర‌కు ఈ బాధ్యత‌ను క‌డ‌ప ఎంపీ అవినాష్ చూశారు. అయితే.. స్థానికంగా ఉన్న బాధ్యత‌లు ఆయ‌న‌కు అప్పగించి.. కీల‌క‌మైన ఈ బాధ్యత‌ను భ‌ర‌త్ కు పూర్తిస్థాయిలో అప్పగించే యోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్నట్టు కీల‌క స‌మాచారం. ఈ ఇద్దరు యువ ఎంపీల‌కు జ‌గ‌న్ దగ్గర పెరిగిన ప్రయార్టీయే ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ ?

Related Posts