YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాజీనామాకు సిద్ధం... చావనైనా చస్తా

రాజీనామాకు సిద్ధం... చావనైనా చస్తా

హైదరాబాద్, మే 3, 
లంగాణలో ఈటల వ్యవహారం ప్రస్తుతం కీలకంగా మారింది. తనపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన తర్వాత ఈటలను కేబినెట్ నుంచి బర్తారఫ్ చేస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ కాలంగా టీఆర్ఎస్ పార్టీలో పనిచేశానన్నారు. కేసీఆర్‌తో కలిసి 19 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. పార్టీకి నష్టం కలిగించే పని ఏనాడు చేయలేదన్నారు.పథకం ప్రకారమే తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల్ని, ధర్మాన్ని నమ్ముకున్నారన్నారు. కేసీఆర్ ఎప్పుడు డబ్బును నమ్ముకోలేదు, అధర్మం వైపు వెళ్లలేదన్నారు.అలాంటి వ్యక్తి ఈటల అనే సాధారణ వ్యక్తిపైన ఇలాంటి ఆరోపణలు చేస్తారా అంటూ ప్రశ్నించారు.కేసీఆర్‌తో అడుగులో అడుగు వేశాక సింగిల్ వ్యాపారం ఒక్కటి కూడా చేయలేదన్నారు ఈటల. పథకం ప్రకారమే తనపై భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారన్నారు.ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమన్నారు ఈటల. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో చర్చించి ఆ మేరకు నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీని, పదవిని వదులుకోవడానికి తాను సిద్ధమన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదం, అభిప్రాయం ప్రకారమే నిర్ణయం తీసుకుంటానన్నారు. ఎమ్మెల్యేగా గెలవాలంటే బీఫామ్ ఒక్కటే సరిపోదన్నారు ఈటల. పార్టీ బీఫామ్ ఇచ్చిన వారందరూ గెలవలేదన్నారు.మీకు ఎందుకు దూరమయ్యానో మీ అంతరాత్మకు తెలుసనన్నారు ఈటల. మంత్రులుగా చూడకపోయినా పర్లేదు.. మనుషులుగా చూడాలన్నారు. చావునైనా భరిస్తా.. కాని నా అత్మగౌరవాన్ని చంపుకోలేనన్నారు ఈటల. తనకు పదవులు కంటే ఆత్మగౌరవం ముఖ్యమన్నారు. దీంతో ఇప్పుడు ఈటల తన భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది.

Related Posts