YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ, జనసేన అట్టర్ ఫ్లాప్ షో

బీజేపీ, జనసేన అట్టర్ ఫ్లాప్ షో

తిరుపతి, మే 4, 
రుపతిలో జనసేన, బీజేపీ అట్టర్ ప్లాప్ షో చూపింది. ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. హమ్మ.. ఎంత బిల్డప్ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉందన్న ఏకైక కారణంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని కూడా ఇబ్బందులు పెట్టాలని చూశారు. ఆలయాల్లో దాడుల ఘటన అయితేనేమి? తిరుపతిలో అన్యమత ప్రచారం జరుుగుతుందని, మత మార్పిడులు రాష్ట్రంలో ఇలా ఒక్కటమేటి అన్ని రకాలుగా బీజేపీ వైసీపీని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించింది.కానీ బీజేపీ పప్పులు తిరుపతి ఉప ఎన్నికల్లో ఉడక లేదు. తాము, జనసేన కలిస్తే ఒక ఊపు ఊపేస్తామని చెప్పింది. రాజధాని అమరావతి అంశాన్ని కూడా తమకు అనుకూలంగా వాడుకోవాలని చూసింది. ఇక తిరుపతి లో దొంగఓట్లు పోల్ చేయించిందని వైసీపీపై యాగీ యాగీ చేసింది. తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే కేంద్రమంత్రి పదవి లభిస్తుందని కూడా ప్రచారం చేసింది. అయినా తిరుపతిలో ప్రజలు బీజేపీ, జనసేనలను పూర్తిగా పక్కన పెట్టాయి.జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పాత విమర్శలనే చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను గుర్తు చేశారు. జనసేన క్యాడర్ అంతా రత్న ప్రభకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభ ద్వారానే కాకుండా పవన్ కల్యాణ్ తిరుపతి ప్రజలకు లేఖ కూడా రాశారు. అయినా పెద్దగా ఓట్లు రాలేదు. బీజేపీ అయితే కేంద్ర మంత్రులను రంగంలోకి దించింది. జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీనడ్డా కూడా ప్రచారానికి వచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రభావం బీజేపీ, జనసేన కూటమిపై భవిష్యత్ లో జరగబోయే ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయిఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇక్కడి బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. విశాఖస్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ, పెట్రోల్ ఉత్పత్తులు, గ్యాస్ ధర పెంపు వంటివి తిరుపతి ఎన్నికల్లో కూడా బీజేపీకి శాపంగా మారాయని చెప్పకతప్పదు. అందుకే బీజేపీకి ఇక్కడ 56,820 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ఇకనైనా విమర్శలు మానుకుని, కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేవిధంగా ప్రయత్నిస్తే బీజేపీ, జనసేనలకు ఏపీీలో భవిష్యత్ ఉంటుంది. లేకపోతే డిపాజిట్లు కూడా దక్కదు. అందుకే ఇక అధికార పార్టీపై విమర్శలకు ఇక జనసేన, బీజేపీ మాస్క్ వేసుకోవాల్సిందే.

Related Posts