YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నందమూరి బాటలో చంద్రశేఖరుడు

నందమూరి బాటలో చంద్రశేఖరుడు

హైదరాబాద్, మే 4, 
కేసీఆర్ కి ఎన్టీయార్ కి కొన్ని పోలికలు ఉన్నాయి. ఇద్దరికీ  అపరిమితమైన ఆత్మవిశ్వాసం ఉంది. ఇద్దరికీ తెలుగు భాష మీద మమకారం ఉంది. ఇద్దరికీ మొండితనం నిండుగా ఉంది. ఇద్దరీ కుటుంబం అంటే విపరీతమైన ప్రేమ. ఎన్టీయార్ అల్లుళ్ళను పోషించాడు. కేసీఆర్ కొడుకు, కూతురుకి పార్టీలో పెద్ద పీట వేశాడు. ఇలా చాలానే చెప్పుకోవచ్చు. అయితే ఎన్టీయార్ లో లేనిది కేసీయార్ లో ఉన్నది రాజకీయ చతురత. కానీ ఒక్కోసారి ఆ చాణక్యాన్ని మొండితనం వెనక్కి తోసేస్తుంది. అందుకే కేసీఆర్ ఆ సమయాన తీసుకునే నిర్ణయాల మీద కూడా వాటి ప్రభావం పడుతుంది.కేసీఆర్ కి ఈటల రాజేందర్ ఒక సోదర సమానుడు అనవచ్చు. లేక పెద్ద కుమారుడు అని కూడా భావించవచ్చు. తెలంగాణా మలి విడత ఉద్యమంలో ఈటల వంటి వారి పాత్ర ఎవరూ కాదనలేనిది. ఇక ప్రత్యేకించి ఈటల బీసీ వర్గానికి చెందిన నాయకుడు. పైగా కేసీఆర్ లాగానే మంచి మాటకారి. మాస్ పల్స్ తెలిసిన లీడర్. తానున్న చోట అపజయం అన్న మాట లేకుండా వరుసగా గెలుస్తున్న నేత. ఇక కేసీఆర్ క్యాబినెట్ లో ఆర్ధిక మంత్రిగా ఆరోగ్య మంత్రిగా కీలకమైన శాఖలను నిర్వహించి తన సత్తా చాటుకున్నాడు, సమర్ధుడిగా గుర్తింపు పొందాడు. అటువంటి ఈటల మీదకేసీఆర్ యాక్షన్ అంటే గులాబీ పాటీకి ఈటె ముల్లు లాంటిదే అన్న చర్చ అయితే ఉంది. టీఆర్ ఎస్ పేరు చెప్పుకుంటే కొందరు అతి ముఖ్య నేతలు గుర్తుకువస్తారు. వారిలో దివంగతుడైన నాయని నరసింహారెడ్డి ఒకరు, ఇక ఉన్న వారిలో ఈటల, హరీష్ రావు వంటి వారు కేసీఆర్ వెన్నంటి ఉన్నారు. ఉద్యమం ఒక ఊపు రూపూ వచ్చాక మిగిలిన వారంతా వచ్చి చేరారు. కానీ ఈటల ఆది నుంచి ఉన్నాడు. తమ మార్గం దుర్గమం అని తెలిసి కూడా ఆయన కేసీఆర్ ని నమ్మి నడిచాడు. ఆ మధ్యన స్వయంగా ఈటల చెప్పుకున్నట్లుగా టీయారెస్ ఓనర్లలో ఆయన కూడా ఉన్నారు. అలాంటిది నీ పాత్ర ఇంతటితో సరి అని బయటకు పంపితే అసలు ఊరుకునే రకం కాదు ఈటెల.ఇంతకాలం టీయారెస్ ని విడిచి వెళ్ళిన నాయకులు వేరు, అలాగే కేసీఆర్ తో విభేదాలు పెట్టుకుని పోయిన వారు వేరు. ఈటల అలాంటి వారు కారు, ఆయన తాను గుంపుపో గోవిందంగా ఉండడానికి ఇష్టపడరు, అలాని ఏదో ఒక పార్టీలో సర్దుకుపోరు. తనకు ఉన్న రెండు దశాబ్దాల అనుభవంతో టీయారెస్ పునాదులే పెకిలించే నైపుణ్యం కూడా ఆయనకు ఉంది. టీయారెస్ లో విభేదాలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఈ సమయాన ఈటల కనుక బయట ఉంటే గులాబీ అద్దాల మేడకు ఇబ్బందే సుమా అంటున్నారు. మొత్తానికి ఈ సీన్లు చూస్తూంటే 1980 దశకం చివరలో ఎన్టీయార్ బడా నాయకులు మంత్రులను బయటకు పంపించిన వైనం, ఆయన ఆయన పడ్డ రాజకీయ కష్టాలు గుర్తుకు వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Related Posts