YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుపై లక్ష్మీపార్వతి వేసిన పిటీషన్ ను కొట్టివేసిన ఏసీబీ కోర్టు

చంద్రబాబుపై లక్ష్మీపార్వతి వేసిన పిటీషన్ ను కొట్టివేసిన  ఏసీబీ కోర్టు

హైదరాబాద్ మే 4
మాజీ సీఎం చంద్రబాబుపై లక్ష్మీపార్వతి వేసిన పిటీషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలని 2005లో లక్ష్మీపార్వతి పిటీషన్ దాఖలు చేశారు.అయితే ఈ పిటీషన్ కు అర్హతలేదని.. తగిన ఆధారాలు లేవని తాజాగా కోర్టు స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబుకు ఊరట లభించింది.2004 ఎన్నికల అఫిడవిట్ లో చంద్రబాబు చూపిన ఆస్తుల వివరాల ఆధారంగా ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి పిటీషన్ వేశారు. అయితే 1987-2005 మధ్య చంద్రబాబు భారీగా ఆస్తులుపెంచుకున్నారని.. విచారణ జరపాలని పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ పై 2005లో హైకోర్టు స్టే ఇచ్చింది.పెండింగ్ లో ఉన్న స్టేలు ఎత్తివేయాలని ఇటీవల సుప్రీంకోర్టు నిర్ణయించింది. దీంతో హైకోర్టు స్టేను ఎత్తివేసింది. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి వేసిన పిటీషన్ పై విచారణ జరపాలని నిర్ణయించిన ఏసీబీ కోర్టు తగిన ఆధారాలు చూపని కారణంగా చంద్రబాబుపై వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది.
చంద్రబాబును ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరికిద్దామని.. ఆయనను జైలుకు పంపింద్దామని ఎంత ప్రయత్నించినా ఆమె ఆశలు నెరవేరడం లేదు. లక్ష్మీపార్వతి పంతం పట్టినా కానీ ఎందుకో 40 ఇయర్స్ చంద్రబాబు  కోర్టుల్లో మాత్రం ఇంతవరకు ఒక్క కేసులో కూడా విచారణ ఎదుర్కోవడం లేదు. ప్రతీదాంట్లోనూ ‘స్టే’ తెచ్చుకుంటూ చాకచక్యంగా తప్పించుకోవడం చర్చనీయాంశమవుతోంది.చంద్రబాబుపై కోర్టుల్లో ఎన్నికేసులు వేసినా నిలబడవని.. మేనేజ్ మెంట్ లో కింగ్ అయిన బాబును ఇరికించడం అంత సులువు కాదని సోషల్ మీడియా వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related Posts