YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

లాక్ డౌన్ నిబంధనలు భేఖాతరు చేస్తే కఠిన చర్యలు

లాక్ డౌన్ నిబంధనలు భేఖాతరు చేస్తే కఠిన చర్యలు

పెద్దపల్లి   మే 14  లాక్ డౌన్ నిబంధనలు భేఖాతరు చేస్తే కఠిన చర్యలు - గోదావరిఖని టూ టౌన్ సిఐ కూచన శ్రీనివాసరావు - లాక్ డౌన్ నిబంధనలకు  విరుద్ధంగా ఓపెన్ చేసిన షాపు యజమానులపై కేసు నమోదు
ప్రభుత్వం పది రోజులపాటు విధించినా డౌన్ సందర్భంగా సీపీ ఆదేశాల మేరకు గోదావరిఖని టు టౌన్ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గోదావరిఖని టూ టౌన్ పోలీసులు లాక్ డౌన్ సందర్బంగా పెట్రోలింగ్ నిర్వహన లో బాగంగా నాలుగు టీంలు ఆర్పెట్ చేసి, ఉదయం 10 గంటల తర్వాత కూడా లాక్ డౌన్ నిబంధనలకు విరుద్దంగా వ్యాపార వాణిజ్య దుకాణాలు  నిర్వహిస్తున్నటువంటి షాపులను గుర్తించడం జరిగింది. సిందిళ్ళ క్రాస్ రోడ్ లోని ఫ్రూయిట్స్ షాప్ యజమాని మండ శుశీల, 8వ కాలనీకి చెందిన శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్ యజమాని బొజ్జ శ్రవణ్, మటన్ మార్కెట్ ఏరియాలోని మటన్ షాప్ యజమాని షేక్ ఇమామ్, శ్రీ అంజనేయం కిరాణ షాప్ యజమాని ఆడపు అజయ్, ఎస్.కె సాదిక్, పెంచికలపేటకు చెందిన చికెన్ షాప్ నిర్వాహకుడు పంజాల లక్ష్మీనారాయణపై సెక్షన్ 188 ఐపీసీ, సెక్షన్ 269 ఐపీసీ, సెక్షన్ 3 ఎపిడమిక్ డిసీజ్ ఆక్ట్  ప్రకారం 6 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం విధించిన  లాక్ డౌన్ ప్రజల శ్రేయస్సు కోసమే కావున అందరూ స్వచ్చందంగా సహకరించాలని సిఐ కూచన శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని టు టౌన్ సిఐ శ్రీనివాసరావు, ఎస్సై టి.కళాధర్ రెడ్డి, శ్రీనివాస్, భాస్కర్, కానిస్టేబుల్  అశోక్, దనునుంజయ్, సతీశ్, హోంగార్డులు మల్లేష్, శ్రీధర్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Related Posts