YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్లీనరీలు..మహానాడులు ఎక్కడ

ప్లీనరీలు..మహానాడులు ఎక్కడ

గుంటూరు, మే 15, 
పార్టీల అధినేతలకు కార్యకర్తలకు మధ్య బంధం బహు గట్టిది. పార్టీకి వారే వారధులు. అటువంటి కార్యకర్తలకు పార్టీ వార్షికోత్సవాలు అంటేనే పెద్ద పండుగలా ఉంటుంది. ఎందుకంటే అపుడు అధినేతతో సన్నిహితంగా మెలిగే చాన్స్ లభిస్తుంది కాబట్టి. ఇక పార్టీ అధినాయకత్వం కూడా క్యాడర్ కి దిశా నిర్దేశం చేయడానికి వార్షికోత్సవాలనే వేదికగా చేసుకుంటుంది. ఇక దేశంలో అన్ని పార్టీలు ఎపుడో ఒకపుడు వార్షికోత్సవాలు చేసుకుంటూ ఉంటాయి. ఏపీలో చూస్తే రెండు బలమైన ప్రాంతీయ పార్టీలుగా వైసీపీ టీడీపీ ఉన్నాయి. ఈ పార్టీల మీద ఇపుడు అందరి చూపు ఉంది.ఏపీలో తెలుగుదేశం పార్టీ మహానాడు అంటేనే తమ్ముళ్లకు పూనకం వస్తుంది. మూడు రోజుల పాటు జరిగే మహానాడు పసుపు పార్టీ జాతరగా కూడా చెబుతారు. చాలా ఘనంగా పార్టీ ఉత్సవాలు జరుగుతాయి. జాతీయ స్థాయి మీడియా కూడా ఇటు వైపు చూసేలా టీడీపీ పార్టీ పండుగ జరుగుతుంది. అయితే 2018 తరువాత టీడీపీలో ఆ ముచ్చట లేకుండా పోయింది. 2019 మే 23న ఎన్నికల ఫలితాలు రావడం టీడీపీ అపోజిషన్ బెంచ్ కి పరిమితం కావడంతో ఏకంగా మహానాడుకే సెలవు ఇచ్చేశారు. ఇక 2020లో మహానాడు జరుపుకోవాలనుకుంటే కరోనా వచ్చి అడ్డుపడింది. ఇక ఈసారి అయితే సెకండ్ వేవ్ గట్టిగానే ఉంది. పైగా మే నెలలో విలయమే అంటున్నాదు. దాంతో ఈసారి కూడా మొక్కుబడిగానే కధ ముగించాలని టీడీపీ భావిస్తోంది అంటున్నారు.ఇక వైసీపీ విషయానికి వస్త నాలుగేళ్ళుగా పార్టీ ప్లీనరీని అసలు నిర్వహించడం లేదు. 2017లో జూలైలో జరిగిన ప్లీనరీలోనే జగన్ పాదయాత్రకు తీర్మానం రూపొందించారు. ఆ తరువాత మళ్ళీ 2019 లో జరపాలి కానీ ఎందుకో నాడు వాయిదా వేశారు. ఇక ఇపుడు కూడా ప్లీనరీ జరుగుతుందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇప్పటికైతే ఎక్కువ టైమే ఉంది. కానీ చూడబోతే కరోనా ధాటి ఎక్కడా ఆగడంలేదు. పైగా ప్లీనరీ అంటే వేలాది మంది కార్యకర్తలు వస్తారు. ఆ మీదట జనాలతో సభను కూడా పెట్టాలని ప్లాన్ ఉంది. ఇవన్నీ కనుక చేయాలనుకుంటే కరోనా అడ్డు వస్తుంది. దాంతో వైసీపీ కూడా ఈసారికి మమ అనిపించేస్తుంది అంటున్నారు.ఇక వైసీపీ పార్టీ రాజ్యాంగం ప్రకారం మరో రెండేళ్ల వరకూ ప్లీనరీ ఊసు ఉండదు, అంటే 2023 లోనే జరపాలి అన్న మాట. అప్పటికి సార్వత్రిక ఎన్నికలు దగ్గర‌కు వస్తాయి. మరి ఆ టైమ్ లోనే సభ జరుపుకుంటారా అన్నదే ఇపుడు చర్చట. ఏది ఏమైనా జగన్ ముఖ్యమంత్రి హోదాలో పార్టీ అత్యున్నత వేదిక మీద మాట్లాడే అవకాశం మాత్రం ఇంతవరకూ లభించలేదు. ఇదిలా ఉంటే పార్టీకి కొత్త కార్యవర్గాలు కూడా లేవు. ప్లీనరీని తూతూ మంత్రంగా ముగించినా కొత్త కమిటీలు వేయకపోతే మాత్రం పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది అంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తారో.

Related Posts