YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీలో విస్తరణ టెన్షన్

వైసీపీలో విస్తరణ టెన్షన్

కాకినాడ, మే 15, 
ఏపీ సీఎం జ‌గ‌న్ అంటే.. సెంటిమెంటుకు చాలా అతీతంగా ఉంటార‌నే పేరుంది. అంటే.. ఆయ‌న ఏ సెంటిమెంటును పెద్దగా లెక్క చేయరు. ఎవ‌రు ఏమ‌నుకున్నా.. తాను చేయాల‌ని అనుకున్నది చేసేస్తారు. అయితే.. ఇప్పుడు అలాంటి జ‌గ‌న్‌ను ఒక సెంటిమెంటు ప‌ట్టి పీడిస్తోంద‌ని.. పైగా అది పార్టీపైనా.. త‌న‌పైనా కూడా ప్రభావం చూపించే అవ‌కాశం ఉంటుంద‌ని అనుకుంటున్నార‌ట‌! నిజానికి ఇంత క‌రోనా స‌మ‌యంలో జ‌గ‌న్ ఇప్పుడు సెంటిమెంటు గురించి చ‌ర్చించుకోవ‌డం ఏంట‌ని సందేహం వ‌స్తుంది. కానీ, దేనిదారి దానిదే! అంటున్నారు అత్యంత విశ్వస‌నీయ నేత‌లు. వారు చెబుతున్న దానిని బ‌ట్టి.. మంత్రి వ‌ర్గ విస్తర‌ణ విష‌యంలో చాలా వ‌ర‌కు త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నారు జ‌గ‌న్‌.ప్రధానంగా రెండు విష‌యాలను జ‌గ‌న్ ప‌రిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గ‌త చంద్రబాబు పాల‌న‌ను ఎంత కొట్టేస్తున్నా.. ఆయ‌న త‌న పాల‌న‌లో చేసిన త‌ప్పులు చేయ‌కుండా.. త‌న పాల‌న‌ను జాగ్రత్తగా నెట్టుకొస్తున్నారు జ‌గ‌న్‌. ఈ క్రమంలోనే ఆయ‌న చంద్రబాబు 2017లో మంత్రి వ‌ర్గ విస్తర‌ణ చేసిన త‌ర్వాత‌.. చేయ‌క‌ముందు.. జ‌రిగిన ప‌రిణామాలు.. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో రోశ‌య్య ప్రభుత్వం.. కిర‌ణ్‌కుమార్ ప్రభుత్వాల్లో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌లు.. వంటివి అధ్యయనం చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఆయా ముఖ్య‌మంత్రుల స‌మ‌యంలో అనేక మంది మంత్రి వ‌ర్గంలో చోటు కోసం ఆశించారు. అయితే.. వారికి ద‌క్కలేదు. వాస్తవానికి తొలి విడ‌త కేబినెట్ ఏర్పాటు చేసేట‌ప్పుడు కూడా ప‌ద‌వులు ద‌క్కని వారిలో అసంతృప్తి ఉంటుంది.అయితే.. అది కొన్నాళ్లకు స‌మ‌సిపోతుంది. కానీ.. ఖ‌చ్చితంగా ఎన్నిక‌ల‌కు ముందు రెండేళ్లలో జ‌రిగే మార్పులు, చేర్పుల విష‌యంలో క‌నుక అసంతృప్తి దొర్లితే.. అది పార్టీపైనా.. త‌న ప్రభుత్వంపై ప్రభావం ప‌డుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి కార‌ణం.. గ‌త చంద్రబాబు హ‌యాంలోను, కిర‌ణ్ ప్రభుత్వహ‌యాంలో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్తర‌ణేల‌న‌ని అంటున్నారు. రెండు సార్లు కూడా సీనియ‌ర్లు ఆయా నేత‌ల‌పై అలిగారు. త‌మ‌కు అవ‌కాశం ద‌క్కలేదని కొంద‌రు , జూనియ‌ర్లకు అవ‌కాశం ఇస్తే.. మాకు ఎప్పుడు న్యాయం చేస్తార‌ని కొంద‌రు పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించారు.ఇది ఎన్నిక‌ల్లో ప్రభావం చూపింది. ఎన్నిక‌ల‌కు ముందు గ్రూపు రాజ‌కీయాలు పేట్రేగి పార్టీ నిలువునా మునిగింది. ఇప్పుడు త‌న‌కు కూడా ఇలాంటి ప‌రిస్థితి ఎదురైతే.. ఏం చేయాలి? అనే త‌ర్జన భ‌ర్జ‌న‌లో జగన్ఉ న్నారు. ఈ క్రమంలో అస‌లు మంత్రి వ‌ర్గ విస్తర‌ణ ఉంటుందా? లేదా? అనే టెన్షన్ ఆశిస్తున్నవారిలో గుబులు రేపుతోంది.

Related Posts