YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేవంత్ కు పగ్గాలు..?

రేవంత్ కు పగ్గాలు..?

హైద్రాబాద్, మే 15, 
తెలంగాణ కాంగ్రెస్ కు సరైన నాయకత్వం లేదు. పీసీసీ చీఫ్ ఎంపిక అనివార్యంగా వాయిదా పడింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత పీసీసీ చీఫ్ ను ఎంపిక చేయాలనుకున్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో పీసీసీ చీఫ్ ఎంపిక అడ్డు కాకూడదని భావించారు. కానీ సాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలయింది. అయితే ప్రస్తుతం కరోనా సమయంలో మరికొంత కాలం పీసీసీ చీఫ్ ఎంపిక వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ఈ సమయంలో రేవంత్ రెడ్డి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు.పీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డిని నియమించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రచార కార్యదర్శిగా రేవంత్ రెడ్డిని నియమిస్తారని భావించారు. కానీ ఇప్పుడు అధినాయకత్వం కూడా పునరాలోచనలో పడిందని చెబుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు ఏమీ లేవు. పార్టీని బలోపేతం చేసే వారికే పగ్గాలు అప్పగించాలని అధినాయకత్వం భావిస్తుందని చెబుతున్నారు. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మాణికం ఠాకూర్ సయితం జీవన్ రెడ్డి నియామకం పట్ల సంతృప్తికరంగా లేరంటున్నారుఅందుకే రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమిస్తే ఎలా ఉంటుందన్న దానిపై అధిష్టానం ఆలోచిస్తుందంటున్నారు. దీనిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఇప్పటికే మాణికం ఠాకూర్ ను కాంగ్రెస్ అధినాయకత్వం కోరినట్లు తెలిసింది. రేవంత్ రెడ్డి అయితేనే కేసీఆర్ ను ఎదుర్కొనగలరని భావిస్తున్నారు. వైఎస్ షర్మిల కూడా పార్టీ పెట్టడంతో రెడ్డి సామాజికవర్గాన్ని కూడగట్టడంలోనూ రేవంత్ రెడ్డి అయితే బెటర్ అని భావిస్తుంది.అయితే రేవంత్ రెడ్డి నియామకానికి కాంగ్రెస్ లోనే అనేక మంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. వీరందరిని ఒప్పించి ఆయనకు పగ్గాలు అప్పగించాలన్న యోచనలో ఉంది. రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించి ఆయనకు పూర్తి స్థాయి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని యోచిస్తుంది. దీనివల్లనైనా వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలోపేతం అవుతుందన్నది అధిష్టానం భావన. అయితే రేవంత్ రెడ్డికి చివరి నిమిషం వరకూ పీసీసీ చీఫ్ పదవి దక్కే అవకాశాలు తక్కువేనని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నా, ఢిల్లీలో మాత్రం రేవంత్ రెడ్డి పేరు మాత్రం బలంగా విన్పిస్తుంది.

Related Posts