YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కరోనా వ్యాది భారి నుంచి ప్రజలను రక్షించేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ కరోనా రోగులకు ప్రత్యేక పరీక్షల విభాగం ఏర్పాటు చేయడం అభినందనీయం

కరోనా వ్యాది భారి నుంచి ప్రజలను రక్షించేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ కరోనా రోగులకు ప్రత్యేక పరీక్షల విభాగం ఏర్పాటు చేయడం అభినందనీయం

రాజమహేంద్రవరం
ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజల ను రక్షించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక చర్యలు చేపట్టారని రాజానగరం ఎమ్మెల్యే, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్  జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగరం లోని జీ.ఎస్.ఎల్ హాస్పిటల్ లో కరోనా రోగులకు ప్రత్యేక ఎంట్రన్స్ ఏర్పాటు చేసి కరోనా రోగులను అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అనంతరం సాధారణ రోగులతో సంబంధంలేకుండా కరోనా వార్డులను వార్డులకు తరలించేవిధంగా ఏర్పాట్లు ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మానవాళి ని గడగడ లాడిస్తుందని అన్నారు. దేశంలో విజృంభిస్తున్న తరుణంలో తాను కూడా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని కరోనా బారిన పడి దేవుని దయవలన కోలుకున్నట్లు తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జీ.ఎస్. ఎల్ ఆసుపత్రి యాజమాన్యం ప్రాణాలు ఫణంగా పెట్టి కరోనా రోగులకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని అనేక గ్రామల నుంచి వచ్చిన వేలాది మంది రోగులు వైద్య సేవలు అందిస్తున్నారని అభినందించారు. కోవిడ్ రోగులకు అన్ని రకాల ఆధునిక వైద్య పరీక్షలు ఒకే చోట ఏర్పాటు చేయడం సాహసోపేత నిర్ణయం అనికొనియాడారు. వైద్య రంగంలో నూతన వరవడి తీసుకుని రావడంలో జీ.ఎస్.ఎల్ ఎం.డి. డాక్టర్ గన్ని భాస్కర రావు  ముందుంటారని అన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా ప్రదలందరికి వ్యాక్సిన్ వేసేందుకు ముఖ్యమంత్రి ఇప్పటికే కార్యక్రమం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీ.ఎస్.ఎల్ హాస్పిటల్ ఎం.డి.గన్ని భాస్కరరావు. డాక్టర్ సందీప్, డాక్టర్ టి.వి.ఎస్.పి.మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Related Posts