YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ అక్రమం క్షత్రియులపై వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాదింపు చర్యలు ఆపాలి లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు మంతెన సత్యనారాయణరాజు

ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ అక్రమం క్షత్రియులపై వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాదింపు చర్యలు ఆపాలి లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు మంతెన సత్యనారాయణరాజు

విజయవాడ
ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వైసీపీ అరాచక పాలనకు   నిదర్శనం. ప్రభుత్వ వైఫల్యాల్ని  ప్రశ్నిస్తే  అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం సిగ్గుచేటు ?  క్షత్రియులపై వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణరాజు విమర్శించారు.  మొన్న అశోక్ గజపతిరాజు రాజుపై అక్రమ కేసు పెట్టారు, ఇవాళ రఘురామ కృష్ణంరాజుని అరెస్ట్ చేశారు? రేపు మరొకరిని అరెస్ట్ చేస్తారు. క్షత్రియులుసర్వశక్తివంతులు, సమస్త దుష్టత్వం నుండి రక్షించి పరిపాలించువాడు క్షత్రియుడు. సమాజ సేవ చేస్తూ.. రాష్ట్రాభివృద్దికి పాటు పడేవాళ్లు.  అలాంటి వారిపై కక్ష్య సాధింపు చర్యలు సరికాదు. క్షత్రియుల ఓర్పు, సహనాన్ని పరీక్షించొద్దు.రఘురామకృష్ణంరాజు పై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తి వేసి విడుదల చేయాలి, లేకపోతే తరవాత జరిగే పరిణమాలకు ప్రభుత్వమే బాధ్యత  వహించాల్సి ఉంటుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ ఈ నెల 17 న విచా రణకు వస్తోంది. ఆ కేసులో లాయర్లు వాదించకుండా భయపెట్టేందుకు అరెస్ట్ చేశారని అన్నారు..
కుల మతాల మధ్య విబేధాలు సృష్టించేలా  వ్యాఖ్యలు చేశారని రఘురామకృష్ణం రాజుని అరెస్టు చేశారు. మరి రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ని, జడ్జిలను  కులం పేరుతో దూషించిన ముఖ్యమంత్రి జగన్ పై, వైసీపీ మంత్రులపై ఎందుకు సీఐడీ కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు.

Related Posts