YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో కులాల రచ్చ

ఏపీలో కులాల రచ్చ

కాకినాడ, జూన్ 23, 
ఏపీ రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు పార్టీ మ‌ధ్య ఉన్న ఫైట్ కాస్తా ఇప్పుడు కులాల మ‌ధ్య‌కు చేరింది. ప్ర‌స్తుతం అగ్ర‌కులాల మ‌ధ్య చిచ్చు రాజుకుంది. ముఖ్యంగా క్ష‌త్రియ కులానికి చెందిన నేత‌లు పార్టీల వారీగా వ‌ర్గ‌పోరుకు దిగుతున్నారు. వారికులానికి చెందిన నేత‌ల‌పై వారే స్వ‌యంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది.ఇక టీడీపీ మాజీ ఎంపీ అయిన అశోక్ గజపతిరాజుపై వైసీపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్‌గా నిన్న క్షత్రియ సామాజికవర్గం ఓ ప్ర‌క‌ట‌న ఇచ్చింది. దీంట్లో గజపతిరాజుపై వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు కావాల‌ని అసభ్య భాషతో విమ‌ర్శ‌లు చేశార‌ని మండిప‌డ్డారు.దీన్ని తాము ఖండిస్తున్న‌ట్టు చెప్పారు. కాగా ఈ ప్ర‌క‌ట‌న చూస్తుంటే వైసీపీకి కౌంటర్ గానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే దీనిపై వైసీపీలోని క్ష‌త్రియ వ‌ర్గానికి చెందిన మంత్రి రంగనాథరాజు రీ కౌంటర్ ఇచ్చేశారు. వైసీపీపై క్షత్రియుల పేరుతో వ‌చ్చిన ప్రకటన ఎవరిదో కూడా తెలియ‌కుండా ఉంద‌ని, అస‌లు అది నిజ‌మైన క్ష‌త్రియులు పంపింది కాద‌ని చెప్పారు. దీంతో ఇటు టీడీపీ అటు వైసీపీ మ‌ధ్య కులాల చిచ్చు ర‌గులుకుంది.
ముద్రగడ లేఖ
ఏపీ సి.ఎం.జగన్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ రాశారు. అశోక్ గజపతిరాజుపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై జగన్‌కు ముద్రగడ లేఖ రాశారు. అశోక్ గజపతిరాజుని జైలుకు పంపుతామని ఎం.పి విజయయిరెడ్డి అనడం బాధాకరమని.. అశోక్ గజపతిరాజును అవమానించద్దని పార్టీ నాయకులకు జగన్ ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు ముద్రగడ. ఉభయ తెలుగు రాష్ట్రాల క్షత్రియులు చేసిన ప్రకటనను సీరియస్ గా తీసుకుని… పరిశీలించుకోవాలని.. లేఖలో పేర్కొన్నారు. రాజ్యాలు పోయినా అశోక్ గజపతిరాజు కుటుంబాన్ని అందరూ గౌరవిస్తారని.. అశోక్ గజపతిరాజు కటుంబం వేల ఎకరాలు ధారాదత్తం చేసి ట్రస్ట్ లు ఏర్పాటు చేశారని లేఖలో ముద్రగడ తెలిపారు.అశోక్ గజపతిరాజుపై అసభ్యంగా మాట్లడకుండా వైసీపీ నాయకులను కట్టడి చేయాలని కోరారు. కాగా.. మాన్సస్ ట్రస్ట్ లో వందల ఎకరాలు కాజేసిన చేసిన పెద్ద దొంగ అశోక్ గజపతిరాజు అని.. అశోక్ గజపతిరాజుపై గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉందని ఇటీవలే విజయసాయిరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. అశోక్ గజపతిరాజు జైలుకి వెళ్లడం ఖాయమని.. మాన్సస్ ట్రస్ట్ తీర్పుపై అప్పీల్ కు వెళ్తామన్నారు

Related Posts