YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

యూపీపైనే కమలం చూపు

యూపీపైనే కమలం చూపు

లక్నో, జూన్ 23, 
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి సవాల్ గా మారాయి. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు పార్టీ భవిష్యత్ ను నిర్దేశించనున్నాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్న బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ లో తిరిగి అధికారంలోకి రావడానికి అన్ని రకాలుగా చర్యలు చేపట్టింది. నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఉత్తర్ ప్రదేశ్ విషయంలో రంగంలోకి దిగడం విశేషం.ఉత్తర్ ప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రం. ఇక్కడ గెలుపును బట్టే కేంద్రంలో అధికారం ఖాయమవుతుందన్నది రాజకీయ నేతల భావన. గత ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన బీజేపీ ఈసారి అష్టకష్టాలు పడుతుంది. యోగి ఆదిత్యానాధ్ పై అసంతృప్తి ఇందుకు కారణం. అన్ని వర్గాల్లో యోగి ప్రభుత్వంపై అసంతృప్తి నెలకొంది. దీని నుంచి బయటపడేసేందుకు మోదీ, షాలు ఆపరేషన్ ఉత్తర్ ప్రదేశ్ ను ప్రారంభించారు.కరోనా కట్టడి, శాంతి భద్రతలపై యోగి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. అందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే. పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత ఉత్తర్ ప్రదేశ్ లో పార్టీ పరిస్థితి కేంద్రం పెద్దలకు అర్థమయింది. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసితో సహా అనేక ప్రాంతాల్లో బీజేపీ ఓటమిపాలయింది. దీంతో మోదీ ఇమేజ్ కూడా పడిపోతుందన్న అంచనాతో ఉత్తర్ ప్రదేశ్ పై కేంద్ర నాయకత్వం ఎక్కువ దృష్టి పెట్టింది.ఇందులో భాగంగానే కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాదను పార్టీలోకి తీసుకు వచ్చింది. రానున్న ఎన్నికల్లో ఆయన కీలకంగా మారనున్నారు. దీంతో పాటు మోదీకి అత్యంత ఆప్తుడయిన ఏకే శర్మను ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమించారు. యోగి ఆదిత్యానాధ్ పై బ్రాహ్మణ సామాజికవర్గం వ్యతిరేకంగా ఉండటంతో ఏకే శర్మ నియామకాన్ని చేపట్టారు. రానున్న కాలంలో ఉత్తర్ ప్రదేశ్ పార్టీలో మరిన్ని మార్పులు ఉండే అవకాశముంది. మొత్తం మీద ఆపరేషన్ ఉత్తర్ ప్రదేశ్ ను మోదీ, షాలు ప్రారంభించినట్లే.

Related Posts