YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వమని అడిగితే అరెస్టు లు చేయడం అన్యాయం ఏబీవీపీ

ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వమని అడిగితే అరెస్టు లు చేయడం అన్యాయం ఏబీవీపీ

ఎమ్మిగనూరు
జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జనవరి మాసంలో నోటిఫికేషన్లు ఇచ్చే ఉద్యోగాలు విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం నుండి బయలుదేరి సోమప్ప కూడలి నందు శాంతియుతంగా  నిరసన తెలిపి ఇచ్చిన మాట తప్పినందుకు  సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని అడిగినందుకు ఏబీవీపీ కార్యకర్తలను అన్యాయంగా పోలీసులు అరెస్టు చేయడమే కాక ఏబీవీపీ నాయకుల పట్ల దుర్భాషలాడడం, ఒకరోజంతా స్టేషన్లో ఉంచి ఇబ్బందులకు గురిచేసి, వారిపట్ల దురుసుగా ప్రవర్తించి అక్రమ కేసులు పెట్టడం  దారుణమని  ఎమ్మిగనూరు ఏబీవీపీ  భాగ్ కన్వీనర్ మారుతి ఆవేదన వ్యక్తం చేశారు.   పోలీసుల తీరు చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని అన్నారు వేలాదిగా ఖాళీగా ఉన్న టీచర్ లెక్చరర్ పోలీసు , ఆరోగ్య శాఖలే కాక వివిధ రకాల ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను మరియు కాంట్రాక్ట్ ఔట్స్కోరింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోవిడ్19 కాలంలో ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉద్యోగులు ప్రైవేట్ టీచర్లను కార్మికులను ఆదుకోని వారికి నష్టపరిహారం అందించి ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని అన్నారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కోర్సులలో తెలుగు మీడియం వేయడం సరికాదన్నారు. ఏబీవీపీ నాయకులపై  పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సూర్య,రఘు,భరత్, ఖాసీం, నవీన్, ఆఫ్రిది,ఉరుకుందు మరియు అఖిల్ తదితరులు పాల్గొన్నారు

Related Posts