YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మా ఎన్నికల బరిలో హేమ

మా ఎన్నికల బరిలో హేమ

హైదరాబాద్, జూన్ 23, 
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ (MAA) ఎలక్షన్స్ మళ్ళీ రానే వచ్చాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నరేష్ పదవీకాలం ముగుస్తుండటంతో టాలీవుడ్‌లో ఎలక్షన్ ఫీవర్ వచ్చి చేరింది. ఇప్పటికే 'మా' అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్ నటుడు ప్ర‌కాశ్ రాజ్‌, మంచు మోహన్ బాబు తనయుడు హీరో మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ ఉండగా తాజాగా సీనియ‌ర్ న‌టిహేమ ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వాతావరణం మరింత రసవత్తరంగా మారింది.ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ.. ''గ‌త కొన్నేళ్లుగా `మా` ఉపాధ్య‌క్షురాలిగా సంయుక్త కార్య‌ద‌ర్శిగా ఈసీ స‌భ్యురాలిగా ప‌ద‌వులు చేప‌ట్టాను. ఆ ప‌ద‌వుల‌కు న్యాయం చేశాను. ఈ సారి కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'మా' అసోసియేష‌న్ ఎన్నిక‌లు రానే వ‌చ్చాయి. ఈ సారి ట్రెజ‌ర‌ర్ ప‌ద‌వికి పోటీ చేయాల‌ని అనుకున్నాను. ఎల‌క్ష‌న్ ముందు ఆలోచ‌న ఇది. కానీ ఆలోచ‌న మారింది.ఎల‌క్ష‌న్‌ని ప్ర‌క‌టించ‌గానే ప్ర‌కాష్ రాజ్ గారు, మంచు విష్ణు బాబు, జీవిత గారు పోటీ చేస్తున్నార‌ని తెలిసింది. పెద్ద‌లంతా ఎల‌క్ష‌న్ బ‌రిలో దిగుతున్నారని తెలిశాక‌.. పెద్ద‌లు పెద్ద‌ల వివాదాల్లో మ‌న‌మెందుకు చిక్కుకోవాలి అనుకొని అస‌లు పోటీ చేయొద్ద‌నే ఊరుకున్నా. నిన్నటి ప్ర‌క‌ట‌న అనంత‌రం సినీప్ర‌ముఖుల నుంచి ఒత్తిడి వచ్చింది. నేను ఉపాధ్య‌క్షురాలిగా పోటీ చేసిన‌ప్పుడు నా స్నేహితులు ముఖ్యంగా లేడీ స‌పోర్ట‌ర్స్ అంతా న‌న్ను మెజారిటీతో గెలిపించిన సినీ ప్ర‌ముఖులంతా ఫోన్ చేసి నువ్వెందుకు పోటీ చేయ‌కూడ‌దు.. నువ్వుంటే బావుంటుంది అంటున్నారు.సినీ నటులు ఎవ‌రైనా క‌ష్టాలు చెప్పుకోవాల‌న్నా, అర్థ రాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటావు. అందుకే నువ్వు బరిలో ఉండాలని అడుగుతున్నారు. నేను పోటీ చేయ‌న‌ని చెప్పినా వినకుండా నావాళ్లంతా ఒత్తిడి చేస్తున్నారు. నాకు అండ‌గా నిలిచిన వారంద‌రికోసం, నా వారి కోసం మా ఎన్నిక‌ల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాల‌నుకుంటున్నాను'' అని హేమ అన్నారు.
వార్ వన్ సైడేనా..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గతంలోకంటే రంజుగా అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తూ రోజు రోజుకీ ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష బరిలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ సై అంటే సై అనడానికి రెడీ కాగా.. 'మా' కార్యదర్శిగా ఉన్న జీవితా రాజశేఖర్‌ కూడా బరిలో నిలవడంతో మా ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోరు తప్పేట్టు లేదు. ఈ ముగ్గురే అనుకుంటే నేనెందుకు కాకూడదు ‘మా’ ప్రెసిడెంట్.. నాకేం తక్కువ అన్నట్టుగా రంగంలోకి దిగింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ.నాకు ఇష్టం లేదు మొర్రో అంటున్నా.. మీకంటే ఎవరూ బాగా చేయలేరు.. మీరు ఉండాల్సిందే.. ఉపాధ్యక్షురాలుగా ఉన్న మీరు అధ్యక్షులు కావాల్సిందే అని అర్థరాత్రి కూడా ఫోన్‌లు చేసేస్తున్నారట హేమకి. అందుకే నేను బరిలో ఉంటున్నా అని చెప్పకనే చెప్పింది హేమ.అయితే హేమ బరిలో ఉన్నా లేకపోయినా.. మిగిలిన ముగ్గురితో పోల్చుకుంటే ఆమె పోటీ చేసినా చేయకపోయినా పెద్ద మ్యాటర్ కాదు. సో.. ప్రధాన పోటీ మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, జీవితా రాజశేఖర్ మధ్యనే ఉండొచ్చు. అయితే ఈ ముగ్గురిలో ‘మా’ అధ్యక్ష పీఠంపై కూర్చునేదెవరు అన్నదే ఇక్కడ హాట్ టాపిక్.ఈ విషయానికి వస్తే.. ఎంతమంది అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని బరిలోకి దిగినా.. మా పీఠం వరించేది మాత్రం మెగాస్టార్ మద్దతు లభించినవారికే. గతంలో కూడా జరిగింది ఇదే. అన్నయ్య ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్లకి మా పీఠం దక్కింది. మెగాస్టార్‌ చిరంజీవి నుంచి మద్దతు లభించిందంటే.. ఆ వ్యక్తి దాదాపు 'మా' అధ్యక్ష పీఠంపై కూర్చున్నట్లే. అయితే ఇప్పుడు మెగాస్టార్ ఎవరికి మద్దతు ప్రకటిస్తారన్నది ఉత్కంఠగా మారింది.ఇండస్ట్రీ వ్యక్తులతో అనుబంధం.. స్థానికత అంశాలను తీసుకుంటే మంచు విష్ణుకి గెలుపు అవకాశాలు ఎక్కువనే చెప్పాలి. ప్రకాష్ రాజ్ స్థానికుడు కాకపోవడంతో పాటు.. తమిళ నడియార్ ఎన్నికల్లో స్థానికత అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయం చేసిన విషయాలను పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. ఇక జీవితా రాజశేఖర్‌కి మంచి అనుభవం ఉండటంతో పాటు.. 'మా'లోని లొసుగులన్నీ తెలిసిన వ్యక్తి కావడంతో ఆమెకు కూడా ‘మా’లో కొంత కేడర్ ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మెగాస్టార్ ఎవరికి మద్దతు ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.మంచు విష్ణు ఫ్యామిలీకి అటు ఏపీ సీఎం జగన్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వంతోనూ మంచి పరిచయాలే ఉన్నాయి. ఇక ప్రకాష్ రాజ్ బీజేపీ వ్యతిరేకి కాగా.. జీవితా రాజశేఖర్ రీసెంట్‌గా బీజేపీ కండువా కప్పుకున్నారు. మా ఎన్నికలు పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాకపోయినప్పటికీ వాటి ప్రభావం అయితే తప్పక ఉంటుంది.ఇక పోతే మెగాస్టార్‌కి మంచు ఫ్యామిలీకి గతంలో విభేదాలు ఉన్నప్పటికీ ఇప్పుడైతే మంచి అనుబంధమే ఉంది. ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూలను గత కొంతకొంతకాలంగా పరిష్కరిస్తూ వస్తున్నారు చిరంజీవి, మోహన్ బాబులు. ఈ తరుణంలో మెగాస్టార్ మద్దతు మంచు ఫ్యామిలీకి లభించే అవకాశం ఉన్నా.. నటుడు ప్రకాష్ రాజ్‌తో చిరంజీవి మంచి సన్నిహిత్యం ఉంది. వీళ్లిద్దరితో కంపేర్ చేస్తే మెగాస్టార్ జీవితా రాజశేఖర్‌లకు సపోర్ట్ చేయడం కాస్త అనుమానమే. మొత్తంగా ఎవరు ఏమనుకున్నా.. ఎంతమంది బరిలో ఉన్నా మెగాస్టార్ మద్దతు ఉంటేనే మా పీఠం దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టి.. అందర్నీ ఏకతాటిపైకి తీసుకుని వచ్చారు. సగానికి సగం ‘మా’ క్యాడర్.. మెగాస్టార్ కాంపౌండ్ నుంచి వెళ్లిన ఆర్టిస్ట్‌లే కావడంతో మెగాస్టార్ మద్దతు అనే కీలకం.అయితే అటు ప్రకాష్ రాజ్.. ఇటు మంచు విష్ణు.. మధ్య జీవితా రాజశేఖర్ ఉండటంతో కీలకమైన నిర్ణయంతో మా ఎన్నికల హీట్‌కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారట చిరు. బరిలో ఉన్న ముగ్గురితో చర్చలు జరిపి.. అసలు ఎన్నికలే లేకుండా ఏకగ్రీవం చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అదే జరిగితే స్థానికత అంశం తెరపైకి వచ్చి.. మంచు విష్ణు ఏకగ్రీవంగా మా అధ్యక్షుడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి మెగాస్టార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో

Related Posts