YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వాటర్ వార్... టీడీపీ లెక్కేంటీ

వాటర్ వార్... టీడీపీ లెక్కేంటీ

విజయవాడ, జేూన్ 24, 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య నీటియుద్ధం మొదలయింది. ఇది ఎంతవరకూ దారితీస్తుందో తెలియదు. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వారివి. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివి. అందుకే ఇద్దరూ తగ్గరు. లోపల ఎలా ఉన్నా బయటకు మాత్రం సవాళ్లు విసురుకోవడం షరా మామూలే. అయితే రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలే ఇందులో రాజకీయంగా లాభపడతాయి. ఇప్పటికే ఏపీలో నీటిపారుదల ప్రాజెక్టు విషయంలో జగన్ నిక్కచ్చిగా ఉంటారన్న ప్రచారం ఊపందుకుంది.ఇందులో రాజకీయంగా ఇబ్బంది పడేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. బీజేపీ, జనసేనలు కూడా ఈ విషయంలో మౌనంగానే ఉన్నాయి. రాయలసీమకు నీళ్లందించేందుకు పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని పెంచుతూ జగన్ తీసుకున్న నిర్ణయంపై కూడా తెలుగుదేశం పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. దీనిపై కడప జిల్లాకు చెందిన నేతలు పాజిటివ్ గా మాట్లాడితే వారికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ప్రాజెక్టుల విషయంలో ఎవరూ మాట్లాడవద్దని షరతు పెట్టారుజగన్, కేసీఆర్ లు కలసి తమను మరింత రాజకీయంగా బలహీనం చేసేందుకు ఆడే డ్రామాలో నీటి ప్రాజెక్టులు ఒకటని చంద్రబాబు పదే పదే పార్టీ సమావేశాల్లో చెప్పేవారు. వారి వలలో పడవద్దని కూడా చంద్రబాబు అనేక సార్లు హెచ్చరించారు. ఇప్పుడు రాజోలి బండ వ్యవహారం రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజోలు బండ దగ్గర కొత్తగా ఏపీ ప్రభుత్వం ఎనభై వేల క్యూసెక్కుల నీటిని తీసుకు వెళుతున్నారని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారుఅయితే తమకు కేటాయించిన నీటిని మాత్రమే తాము వాడుకుంటామని, కొత్త ప్రాజెక్టులను తాము వేటినీ నిర్మించడం లేదని, పాత ప్రాజెక్టులనే మరమ్మత్తులు చేసుకుంటున్నామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెబుతున్నారు. దీనిపై రగడ రోజురోజుకు ముదరుతుంది. అయితే ఈ వివాదం అధికార వైసీపీకి అడ్వాంటేజీగా మారుతున్నా తెలుగుదేశం పార్టీ నోరు మెదపలేని పరిస్థితుల్లో ఉంది. ఇటు బీజేపీ, జనసేనలు కూడా ఈ వివాదానికి దూరంగా ఉండటం విశేషం.

Related Posts