YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆర్ధిక శాఖలో పరేషాన్

ఆర్ధిక శాఖలో పరేషాన్

విజయవాడ, జూన్ 24,
మంత్రులుగా ఎవరున్నా క్యాబినెట్ లో జగన్ ఆల్ ఇన్ వన్ అన్నది తెలిసిందే. ప్రతీ రోజు పలు శాఖ మీద ఆయన సమీక్ష చేస్తారు. ఆయనే డైరెక్ట్ గా నిర్ణయాలూ తీసుకుంటారు. మొత్తానికి చాలా మంది మంత్రులు తమకు పెద్దగా పని లేదనే అనుకుంటారు. ఇదిలా ఉంటే ఆర్ధిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అయితే ఏమంత సంతృప్తిగా లేరు అన్న మాట అయితే వినిపిస్తోంది. ఆయన ఇప్పటికి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. రెండేళ్ళు కరోనాతో రాష్ట్రం ఆర్ధికంగా చితికిపోయింది. ఇక మరో వైపు సంక్షేమ కార్యక్రమాలు, ఆదాయానికి ఖర్చుకు కుదరని లింక్ తో బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెగ పరేషాన్ అవుతున్నారుట.ఇక మరో అయిదారు నెలల్లో జగన్ మంత్రి వర్గం పునర్ వ్యవస్థీకరణ ఉంటుంది అంటున్నారు. దాంతో బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి లాంటి వారికి బిగ్ రిలీఫ్ లభిస్తుందా అన్న చర్చ అయితే ఉంది. కర్నూల్ జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిని ఈసారి కొనసాగించకపోవచ్చు అన్న టాక్ అయితే ఉంది. ఒకవేళ కొనసాగించినా ఆర్ధిక శాఖ ఇవ్వరు అన్న మాట కూడా ఉంది. అయితే ఏపీలో అంతకంతకు పెరిగిపోతున్న అప్పులతో పాటు ఆదాయ మార్గాలు లేక నానా ఇబ్బందులు పడుతున్న బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తన విషయంలో సీఎం ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా ఓకే అన్నట్లుగా ఉన్నారుట.నిజానికి ఆర్ధిక శాఖ అంటే చాలా పెద్ద బాధ్యత. మూడేళ్ళ క్రితం జీఎస్టీ ప్రవేశ పెట్టాక రాష్ట్రాల ఆర్ధిక మంత్రులకు తెగ ఆయాసం వస్తోంది. ఆదాయమంతా పన్నుల రూపేణ కేంద్రానికి జమ అవుతోంది. అక్కడ నుంచి అడిగి తెచ్చుకోవడం ఒక సమస్య అయితే రాష్ట్రాల‌లో ఉన్నంతలో ఆదాయ మార్గాలు పెంచుకోవడం మరో సమస్య. ఇక కరోనా తో అన్ని రాష్ట్రాలూ కుదేల్ అయ్యాయి. దాంతో పాటుగా సంక్షేమం మీద అంతా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్ధిక మంత్రిగా నిభాయించుకుని రావడం అంటే పెను సవాలే అంటున్నారు. ఇక ఏపీ లాంటి రాష్త్రాల సంగతి వేరేగా చెప్పేది కూడా లేదు. దాంతో ఆర్ధిక మంత్రిత్వ శాఖ అంటే బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డితో పాటు చాలా మంది వెనకడుగే వేస్తున్నారు అంటున్నారు.కొన్ని రాష్ట్రాల‌లో ముఖ్యమంత్రులే ఆర్ధిక శాఖను నిర్వహిస్తూంటారు. ఇక ఏపీ వరకూ చూస్తే అన్ని విషయాల మీద పూర్తి అవగాహన ఉన్న జగనే ఈ శాఖను స్వయంగా చూసుకుంటే బెటర్ అన్న మాట కూడా పార్టీలో ఉందిట. ఆదాయం లేని చోట అప్పులు దారుణంగా పెరిగిపోయిన నేపధ్యంలో మంత్రిగా ఎవరున్నా చేసేది లేదన్న చర్చ ఉంది. అదే జగన్ అయితే నేరుగా కేంద్రంతో మాట్లాడో మరో విధంగా చేసో ఏపీలో పాలనను గాడిన పెట్టగలరని అంటున్నారు. మొత్తానికి అచ్చిరాని శాఖల జాబితాలో ఆర్ధిక శాఖ కూడా చేరిపోతోంది. జగన్ మెచ్చి మంత్రులుగా చేసినా విత్తం వద్దు చిత్తం ప్రభో అన్నట్లుగా వైసీపీలో సీన్ ఉందిట.

Related Posts