YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీఎం సమక్షంలో సహజ వ్యవసాయ పద్ధతులపై రైతు సాధికార సంస్థతో టీటీడీ ఒప్పందం టిటిడి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అభినందించిన ముఖ్యమంత్రి

సీఎం సమక్షంలో సహజ వ్యవసాయ పద్ధతులపై రైతు సాధికార సంస్థతో టీటీడీ  ఒప్పందం  టిటిడి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అభినందించిన ముఖ్యమంత్రి

సీఎం సమక్షంలో సహజ వ్యవసాయ పద్ధతులపై రైతు సాధికార సంస్థతో టీటీడీ  ఒప్పందం
 టిటిడి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అభినందించిన ముఖ్యమంత్రి
తిరుమల, అక్టోబరు 12
తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ఉదయం రాష్ట్ర ముఖ్య మంత్రి   వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలో జరిగిన కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టిటిడి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను గో సంరక్షణకు టిటిడి ఏ విధంగా కృషి చేస్తోంది, పలమనేరు వద్ద 400 ఎకరాలలో గో శాల అభివృద్ధిని గురించి తెలియజేశారు. ఇందులో భాగంగా శ్రీవారి గో ఆధారిత నైవేధ్యం, గుడికో గోమాత, అగరబత్తుల తయారీ, పంచగవ్య ఉత్పత్తులు, గో ఆధారిత వ్యవసాయం తదితర వాటిపై ముఖ్యమంత్రికి వివరించారు. వివరించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సహకారంతో డ్రై ఫ్లవర్ టెక్నాలజితో టిటిడిలోని వివిధ ఆలయాల్లో ఉపయోగించిన పూలతో స్వామి, అమ్మవార్ల ఫోటోలు, క్యాలండర్లు, కీ చైన్లు, పేపర్  వెయిట్లు తదితరాలు తయారీ విధానాన్నిఈవో వివరించారు. అనంతరం ఎస్వీబిసిలో ప్రసారం అవుతున్న ఆధ్యాత్మిక, భక్తి కార్యక్రమాల వివరాలను అదనపు ఈవో  ఎస్వీబిసి ఎండి  ఎవి.ధర్మారెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి టిటిడిని అభినందించారు.  
 రైతు సాధికార సంస్థతో ఎంఓయు  
సహజ వ్యవసాయ పద్ధతులపై ముఖ్యమంత్రి సమక్షంలో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్  విజయ్కుమార్, టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డిలు ఎంఓయు  పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమానంతరం అన్నమయ్య భవనం అవరణంలో నిత్య పుష్ప కైంకర్య సేవలో తరించిన పుష్పాలతో తయారు చేసిన దేవతా కళా కృతులను ముఖ్యమంత్రి పరిశీలించి, ఈ కళాకృతులను తయారుచేసిన మహిళలను అభినంధించారు.
ఈ కార్యక్రమంలో  డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి, టిటిడి చైర్మన్  వైవి సుబ్బారెడ్డి, ఎంపీలు  మిథున్ రెడ్డి,  గురుమూర్తి,  మంత్రులు  పి. రామచంద్రారెడ్డి,  వి.శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్  ఎం.హరినారాయణ, ఎమ్మెల్యేలు  కరుణాకర్ రెడ్డి,  కాటసాని రాంభూపాల్ రెడ్డి,  మధుసూధన్ రెడ్డి,  ఆదిమూలం, బోర్డు సభ్యులు  ఆశోక్ కుమార్, జెఈవోలు  సదా భార్గవి,  వీరబ్రహ్మం, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డా.జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts