YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

భూమాకు టాస్క్ పెద్దదే

భూమాకు టాస్క్ పెద్దదే

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు మాత్రమే సమయం ఉంది. టీడీపీ నేతలు ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. ప్రధానంగా కొందరికి వచ్చే ఎన్నికలు జీవన్మరణ సమస్య. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు వచ్చే ఎన్నికలు ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లోనూ గెలవకపోతే భూమా అఖిలప్రియకు రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పటికే అనేక కేసుల్లో ఆమె ఇరుక్కుని సతమతమవుతున్నారు.నిజానికి భూమా కుటుంబంలో నాగిరెడ్డి, శోభ తర్వాత అంత స్థాయిలో ప్రభావితం చేయగలిగిన నేత ఆ కుటుంబం నుంచి ఎవరూ రాలేదు. భూమా అఖిలప్రియకు ఆ వారసత్వం వహిస్తుందని భావించారు. కానీ బ్యాడ్ లక్ ఆమె నేరుగా ఎన్నికల్లో గెలవలేకపోయారు. తొలిసారి గెలిచింది ఏకగ్రీవంతోనే. ఆ తర్వాత ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూశారు. తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన నంద్యాలతో సయితం ఉప ఎన్నికల్లోనే ఆ కుటుంబం విజయం సాధించిందిఇప్పుడు భూమా అఖిలప్రియ ముందు పెద్ద టాస్కే ఉంది. తొలుత కుటుంబాన్ని చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. భూమా అఖిలప్రియ మంత్రిగా ఉన్నా ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. ముఖ్యంగా ఆమె వివాహం తర్వాత కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఆమె నుంచి విడిపోయారు. దీంతో ఆళ్లగడ్డలో భూమా కుటుంబం పట్టు సడలింది. గంగుల కుటుంబాన్ని ధీటుగా ఎదుర్కొనాలంటే తిరిగి కుటుంబ సభ్యులను తన చెంతకు అఖిల ప్రియ చేర్చుకోవాల్సి ఉంటుంది.భూమా అఖిలప్రియ ప్రస్తుతం ఆళ్లగడ్డలోనే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలను కూడా తరచూ నిర్వహిస్తున్నారు. తన వద్దకు వచ్చిన కార్యకర్తలతో మనసు విప్పి మాట్లాడుతున్నారు. భర్త ను ప్రస్తుతం ఆళ్లగడ్డ రాజకీయాలకు దూరంగా ఉంచారు. తానే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవసరమైన కార్యకర్తలకు ఆర్థికసాయం చేస్తూ అండగా ఉంటున్నారు. మరి ఆళ్లగడ్డ లో భూమా అఖిలప్రియ ఈసారైనా పట్టుసాధిస్తుందా? అనేది చూడాల్సి ఉంది.

Related Posts