YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వరితో పాటు చేపలు.. కొత్త ఆలోచనల్లో రైతాంగం

వరితో పాటు చేపలు.. కొత్త ఆలోచనల్లో రైతాంగం

నిజామాబాద్, మే 16,
వరి మడుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల వ్యవసాయంపై జరిగిన కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్లో వరి పొలాల్లో చేపల పెంపకంపై చర్చ జరిగింది. చెరువుల్లో చేపలు పెంచినట్లే వరి పొలాల్లో చేపల పెంపకం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని కమిటీ సూచించింది. ఈ నేపథ్యంలో చేపల పెంపకంపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టింది. దీనిపై రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.వరి సాగులో నీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. నాట్లు పడిన నాటి నుంచి ఏపుగా పెరిగి పంట ఈనే వరకు పొలాల్లో నీరు నిల్వ ఉంటుంది. ఆగ్నేయాసియా దేశాల్లో పంట పొలాల్లో చేపలు పెంచుతున్నారు. మన దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లోనూ పంట పొలాల్లో చేపల సాగు జరుగుతోంది. వరి పొలాల్లోని నీటి నిల్వల్లో చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు, బాతులను పెంచుతూ ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే వీలుంటుంది. రాష్ట్రంలో భూగర్భ జలాలు, నీటి వనరులు పెరగడంతో వరి సాగు ఏటా గణనీయంగా పెరుగుతోంది. అందువల్ల చిన్న, సన్నకారు రైతులతో వరితోపాటు చేపలను సాగు చేయిస్తే వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.వరి సాగు వల్ల పొలాల నుంచి మీథేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాయువు విడుదలవుతుంది. ఇది కూడా గ్లోబల్ వార్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కారణమవుతోందని నిపుణులు అంటున్నారు. వరి పొలాల్లో చేపలను పెంచడం ద్వారా మీథేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తగ్గించే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. అంతే కాదు వరి, చేపలు ఉండే పొలాల్లో రసాయన ఎరువుల వాడకం కూడా తగ్గుతుంది. దీంతో భూసారంతోపాటు ఉత్పత్తి పెరిగి అదనపు ఆదాయం వస్తుంది.రాష్ట్రంలో ఏ భూముల్లో, ఏ రకాల చేపలను వరితోపాటు సాగు చేయవచ్చో అధ్యయనం చేయాల్సి ఉంది. నీరు పుష్కలంగా లభించే ప్రాంతాల్లో పరిశోధనలు చేయించి అనుకూలమైన ప్రాంతాలను అధికారులు గుర్తించనున్నారు. ఈ పద్ధతిలోకి మారాలంటే రైతులు తమ పొలాలను చేపల పెంపకానికి తగినట్లు సిద్ధం చేసుకోవాలి. దీనికి ప్రత్యేక రుణ సాయం అందించి ప్రోత్సహించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో చేపల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నందున వరి-చేపల సాగుకు చేయూతనిచ్చేలా ఉచిత చేప పిల్లలను అందించి రైతుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచిస్తున్నారు.

Related Posts