YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సర్పంచుల సస్పెన్షన్ యాదాద్రి-భువనగిరి

సర్పంచుల సస్పెన్షన్ యాదాద్రి-భువనగిరి

జిల్లాలో వరుసగా.. సర్పంచులు, ఉప.సర్పంచులు, విలేజ్ సెక్రటరీలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. తుర్కపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్, విలేజ్ సెక్రటరీ లపై సస్పెన్షన్ వేటు పడింది.వారిపై వార్డు సభ్యుడు ఆకుల సతీష్ 2021లో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో కలెక్టర్ పమేలా సత్పతి  చర్యలు తీసుకున్నారు. తాజాగా కలెక్టర్ -జిల్లాలో మరో సర్పంచ్ పై వేటు వేసారు. భువనగిరి మండలం, చందుపట్ల సర్పంచ్, ఎంపిటిసి గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మాజీ సర్పంచ్ ఫిర్యాదు చేయడంతో అడిషనల్ కలెక్టర్ ఎంక్వయిరీ చేసి రికార్డులను స్వాధీనo చేసుకున్నారు. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో  గతంలోనే గ్రామ సెక్రటరీ ని సస్పెండ్ కాగా తాజాగా సర్పంచు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్ కావడంతో, దాదాపు 25 గ్రామాల సర్పంచులు  ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ను కలిసినట్లు  సమాచారం. అయన జిల్లా కలెక్టర్ తో మాట్లాడి, ప్రస్తుత పరిస్థితుల్లో సర్పంచ్ పై వేసిన వేటను వెనక్కి తీసుకోవాలని  కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే సదరు  సర్పంచులఅవినీతి విషయం మీడియాకు, బయటకు రావడంతో  తాజాగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత రెండు నెలల వ్యవధిలో.. నలుగురు సర్పంచుల పై వేటు పడింది. ఈ సర్పంచులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు తాజాగా.. ఇద్దరు సర్పంచ్లు, ఒక ఉపసర్పంచ్, సెక్రటరీ, ఎంపీటీసీపై  సస్పెన్షన్ వేటు పడింది.

Related Posts