
యాదాద్రి
తెలంగాణ లో భారీ మొత్తం లో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయని నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సూచించారు. ల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో నారాయణాపురం,చౌటుప్పల్ మండలాల నిరుద్యోగ యువత, యువకులకు ఉచిత శిక్షణ శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే కూసుకంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజక వర్గంలో చండూరు, చౌటుప్పల్ మండలాల్లో కోచింగ్ సెంటర్లు తన సొంత నిధులతో ఏర్పాటు చేశామని, నిరుద్యోగ యువతి యువకులకు వినియోగించుకోవాలని సూచించారు.మునుగోడు నుండి అత్యధికంగా ఉద్యోగాలు పొందాలని ఆశాభావం వ్యక్తంచేశారు.