YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్లాన్ బీలో కమలం....

ప్లాన్ బీలో కమలం....

హైదరాబాద్, జూన్ 22,
రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ మరో వ్యూహానికి తెరదీసింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో జంబ్లింగ్సిస్టం ద్వారా ఇన్చార్జీల నియామకాన్ని చేపట్టింది. ఒక నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతలను మరో నియోజకవర్గం లేదా మరో జిల్లాకు చెందిన వ్యక్తికి అప్పగించింది. 119 నియోజకవర్గాల్లోనూ ఇలాగే చేపట్టి బూత్లెవల్‌లో పార్టీ బలోపేతం చేపట్టాలని ప్రణాళికలు చేస్తోంది. స్థానికేతరులకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీ స్థితి, బలోపేతం కోసం తీసుకోవాల్సిన విషయాల్లో వాస్తవికత అర్థమవుతుందని భావించిన రాష్ట్ర నాయకత్వం కొత్త పంథాను ఎంచుకుంది. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో సక్సెస్అవ్వొచ్చని రాష్ట్ర నాయకత్వం భరోసా కనబరుస్తోంది.రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేసేందుకు ఇప్పుడున్న శక్తి సరిపోదని, మరింత చెమటోడ్చాల్సిన అవసరముందని రాష్ట్ర నాయకత్వం భావించింది. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి పలు జిల్లాల అధ్యక్షులు పూర్తి స్థాయిలో సహకరించడంలేదని తెలుస్తోంది. అక్కడ పార్టీ విస్తరణ, బలోపేతానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న దృష్ట్యా నేరుగా హైకమాండ్ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుని నియోజకవర్గాలకు ఇన్చార్జీల నియామక ప్రక్రియకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా అధ్యక్షులకు సంబంధం లేకుండానే నేరుగా నియోజకవర్గాల సమాచారాన్ని బండి తీసుకునే అవకాశముంది. దీంతో గ్రౌండ్లెవల్‌లో ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు ప్రజల్లో ఉంటున్నారనే నివేదిక నేరుగా బండి సంజయ్‌కు అందనుంది. ఇదిలా ఉంటే బండి పాదయాత్ర ప్రజా సంగ్రామ యాత్ర పేరిట రెండు విడుతల పాదయాత్ర పూర్తిచేశారు. ఆయన పర్యటనలు చేసిన తర్వాత కూడా ఆయా ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలు యాక్టివ్‌గా పనిచేయడంలేదు. దీంతో స్థానికేతరులను రంగంలోకి దింపాలని బండి సంజయ్ నిర్ణయించుకున్నటు తెలుస్తోంది.బూత్స్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఇన్ చార్జీలను కూడా నియమిస్తే బాగుంటుందని హైకమాండ్కూడా రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ టికెట్ఆశించే వారికి కాకుండా దాదాపు ఎన్నికలకు దూరంగా ఉండి పార్టీకోసం కష్టపడి పనిచేసే వారిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ కండీషన్స్వర్తిస్తాయని రాష్ట్ర నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు నియామకమైన ఇన్చార్జీలు నెలలో కనీసం 20 రోజులైనా వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేపట్టాలని, పార్టీని విస్తరణకు కృషి చేయాలని రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇన్చార్జీల బాధ్యతలు కేవలం వచ్చే నెలలో చేపట్టబోయే జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోడీ సభ వరకు మాత్రమేనని పలువురు చెబుతున్నా.. ఈ ఇన్‌చార్జీలను ఇలాగే కొనసాగించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related Posts